»   »  ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిడుతున్నారు, రాజకీల్లోకి వస్తా!

ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిడుతున్నారు, రాజకీల్లోకి వస్తా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వారిలో తమిళ కమెడియన్ వడివేలు ఒకరు. ఆ మధ్య అన్నాడీఎంకె పార్టీ తరుపున ప్రచారం చేసిన వడివేలు రజనీకాంత్ తో సహా, కొందరు నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతను నటించిన తెనాలిరామన్ అనే చిత్రం కూడా వివాదాల్లో చిక్కుకుంది.

తాజాగా వడివేలు నటిస్తున్న చిత్రం ‘ఎలి'. తెనాలిరామ్ చిత్ర దర్శకుడు యువరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సదా హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ..వడివేలు మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిట్టేస్తున్నారన్నారు. వరుసగా చిత్రాలు చేయడం లేదన్నదే వారి కోపానికి కారణం అన్నారు.

Vadivelu's Funny 'Eli' Press Meet

వారిని దృష్టిలో పెట్టుకుని కొంచెం గ్యాప్ తీసుకుని ఈ ఎలి చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిన వడివేలు హీరోయిన్‌గా సదాతో డ్యూయెట్లు పాడలేదన్నారు. తాను ఎలి (ఎలుక) ప్రతీప్ రావత్ పూణై (పిల్లి)గా నటిస్తున్నట్లు తెలిపారు. ఎలుక ఏమేమి చేస్తుందో తానీ చిత్రంలో అవన్నీ చేస్తానని చెప్పారు.

ఇది పిరియడ్ చిత్రం కాకున్నా 1960 నుంచి 70 వరకు జరిగే కథా చిత్రం అన్నారు. ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఏమైనా జరగవచ్చు నని తాను రాజకీయాల్లో కొచ్చే అవకాశం లేకపోలేదని వడివేలు అన్నారు.

Read more about: vadivelu, వడివేలు
English summary
Vadivelu's Funny 'Eli' Press Meet held at Chennai. Eli is an upcoming Tamil Movie. Directed by Yuvaraj Dhayalan and Produced by G Sathish Kumar under City Cine Creations. Music by Vidyasagar.
Please Wait while comments are loading...