»   » అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ...

అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : వడివేలు ప్రధాన పాత్రలో నటించిన 'తెనాలి రామన్‌' వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు లేదు. అయితే చలనచిత్రం విషయంలో నిర్మాత, దర్శకుడు, నటీనటులపై మాకు ఎలాంటి దురుద్దేశం లేదని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సినిమా విడుదలకు ముందు తెలుగు, తమిళ, కన్నడ సంఘాల వారికి ముందస్తుగా చూపించి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి, తిరిగి రీ షూట్ చేసి విడుదల చేయాలని కోరుతున్నట్లు ప్రకటనలో కృష్ణారావు వివరించారు.

  తమిళనాడులో నివశిస్తున్న తెలుగువారు ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి పెరిగారని, తెలుగు, తమిళం అనే భాషా భేదం లేకుండా పాలు, నీరులా కలిసిమెలిసి జీవిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రను హాస్య దోరణిలో వడివేలు నటించటంపై పలు తెలుగు సంఘాల వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు.

  కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రూపొందించిన చిత్ర నిర్మాతలను కష్టపెట్టాలనే దురుద్దేశం ఎవరికి లేదని అయితే ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడంలపై అమోఘమైన అభిమానం కలిగిన శ్రీకృష్ణదేవరాయుల పాత్రను గౌరవించే విధంగా చిత్రికరించి విడుదల చేయాల్సిందిగా మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు.

  Vadivelu's Tenaliraman in controversy

  తెలుగు కోసం విశేషకృషి చేసిన చక్రవర్తి పాత్రను వక్రీకరించి చూపటం తగదని తెలుగు సంఘాల వారు అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మహానటులు పోషించిన పాత్రను హాస్యనటుడితో వేయించి అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం మొదలైన తర్వాత సరి చేసుకోమని కోరినా నిర్మాతలు అంగీకరించటం లేదన్నారు.

  ఇప్పటికే గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ విభాగాల ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించామన్నారు. మార్పులు చేయకుండా థియేటర్లలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే ఆందోళనలకు దిగుతామన్నారు. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాయని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదని ముక్తకంఠంతో కోరారు. పొరుగునున్న కర్ణాటకలో ప్రదర్శనకు థియేటర్ల నిర్వాహకులు నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు.

  '23మ్‌ పులికేసి' వంటి చరిత్రాత్మక కథలో నటించి.. రెండు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను వడివేలు కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా తెరకు దూరమైన ఆయన ప్రస్తుతం సరికొత్తగా మళ్లీ తెరపైకి వస్తున్నారు. 'జగజ్జాల భుజబల తెనాలిరామన్‌' చిత్రంలో ఆయన శ్రీకృష్ణ దేవరాయులు, తెనాలిరాముడి పాత్రలను పోషిస్తున్నారు.

  పూర్తి కామెడీ తో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఫొటోలు, వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచింది యూనిట్‌. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, ఆడియోను విడుదల చేశారు. ఇందులో వడివేలు ఆహార్యం నవ్వులు పూయిస్తోంది. యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.25 కోట్లతో తెరకెక్కిస్తోంది.

  దర్శకుడు మాట్లాడుతూ.. '' వడివేలు స్థాయికి తగిన చిత్రమిది. '23మ్‌ పులికేసి' మాదిరిగా మంచి విజయం సాధిస్తుంది. వడివేలు రీఎంట్రీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మీనాక్షి దీక్షిత్‌ వడివేలు సరసన నటిస్తోంది. శివాజీ నటించిన తెనాలిరామన్‌కు దీనికి ఏమాత్రం సంబంధం లేదు''అని చెప్పారు.

  English summary
  
 The producers of Vadivelu's comeback film 'Jagajjala Pujabala Tenaliraman', AGS Entertainment have come out with a statement against claims that the film would hurt the sentiments of Telugu people.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more