»   » హీరోగా మరో కమిడియన్ కొడుకు

హీరోగా మరో కమిడియన్ కొడుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vadivelu Son entering as Hero
చెన్నై: తెలుగులో వరసగా హాస్య నటులు కుమారులు సినీ తెరంగ్రేటం చేస్తున్నారు. తాజాగా తమిళ కమిడియన్ కుమారుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై వడివేలు మాట్లాడుతూ... మా అబ్బాయి పేరు సుబ్రమణి. త్వరలోనే తెరపైకి వస్తాడు. ఇప్పుడు నేను సిక్సర్లు కొట్టాక.. తను మిగిలిన పరుగులు పూర్తిచేస్తాడు అని చెప్పుకొచ్చారు.

కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో హాస్య సామ్రాజ్యానికి రారాజుగా వెలిగాడు వడివేలు. కానీ రాజకీయాల జోక్యంతో తెరమరుగయ్యాడు రెండేళ్లు. 'కానీ ఆ సమయంలో నా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగా.. తండ్రిగా కొన్ని కర్తవ్యాలను నెరవేర్చా.. కుమార్తె పెళ్లి చేశా.. కుమారుణ్ని ప్రయోజకుడిగా చేస్తున్నా'నని చెబుతున్నాడు వడివేలు. ఈ విరామ సమయంలోని నవ్వుల జల్లులను ఒకే సినిమాతో కురిపిస్తానని చెబుతున్నాడు. ఆయన తాజా చిత్రం 'జగజ్జాల భుజబల తెనాలిరామన్‌'. దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవల విడుదలై.. వడివేలు అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. ఆ చిత్ర విశేషాల గురించి వడివేలు మాట్లాడారు.

ఇక రాష్ట్ర ప్రజలకు దూరంగా ఎలా గడిపారు అన్న విషయం చెప్తూ.... తమిళ ప్రజలకు నేను నచ్చడం.. నాకు దక్కిన వరం. ఒక ఇంట్లో చంటి పిల్లోడు కనిపించకుండా పోతే.. 'మా అబ్బాయి కనపడట్లేదు..' అంటూ ఆవేదన పడుతుంటారు. అతడు మళ్లీ కనిపిస్తే 'ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావురా..' అంటూ కన్నీళ్లపర్యంతమవుతారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, నా స్నేహితులు, అభిమానులు, హాస్యప్రియులు అలాగే సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతటి ఆనందం ఎవరికి దక్కుతుంది చెప్పండి. ప్రతి ఇంట్లోనూ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నారు.

పురాణ చిత్రాల్లో నటించడంపై స్పందిస్తూ... 'హింసై అరసన్‌' తర్వాత పురాణ చిత్రాలంటే ఆసక్తి పెరిగింది. భయం తగ్గింది. ఎలాంటి నటుడైనా ఎవర్నో ఒకర్ని, ఎక్కడో అక్కడ అనుకరించే తీరుతాడు. పూర్తిస్థాయిలో తనదైన నటనను ప్రదర్శించలేడు. గతంలో వచ్చిన పురాణ చిత్రాలను చూసే ప్రస్తుతం నటిస్తున్నా. ఎవరూ చేయలేని విషయాలను చేయడమే గొప్పతనం. నేను ఆ దిశగానే వెళ్తున్నా.

మిమ్మల్ని చాలా మంది అనుకరిస్తున్నారే అంటే సమాధానమిస్తూ... అది చాలా మంచి విషయం. నేను లేకున్నా నన్ను ప్రేక్షకులకు గుర్తుకుతెస్తున్నారు. నాలా మాట్లాడుతూ, నన్ను అనుకరిస్తూ ఇలా చేస్తున్న వారికి నా కృతజ్ఞతలు. దర్శకుడు యువరాజ్‌ గురించి చెప్తూ... ఆయన నా కుటుంబ సభ్యుడి వంటివారు. కానీ మా మధ్య సమస్యలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అన్నారు.


నేటి చిత్రాల్లో హాస్యం తీరు గురించి మాట్లాడుతూ... ఇప్పుడొస్తున్న సినిమాలు చూసేలా ఉన్నాయా? వాటిల్లోని హాస్య సన్నివేశాలు నవ్విస్తున్నాయా? వాటి గురించి ఇప్పుడొద్దులేండి. వందేళ్ల వేడుకలో మిమ్మల్ని పక్కనబెట్టారంటూ వచ్చిన విమర్శలపై అభిప్రాయం చెప్తూ... అదంతా నిజం కాదండి. ఓ ముఖ్యమంత్రికి ఎన్నో పనులుంటాయి. అలాంటి హడావిడి మధ్య పనిగట్టుకుని నన్ను పక్కనబెట్టాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆ నమ్మకం నాకుంది అన్నారు.

English summary
As Comedian Vadivelu has took a break from film after the State Assembly elections in May last year. Now he is in plans to launch his son Subramanian into the field. Vadivelu himself has plans to produce the film for his son and debut his son as hero. However Subramaniam will not enter into comedy or politics track. He planned to entertain his fans through his action, drama and even with dance. As soon as script is finalized the project will be rolling up soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu