»   » టీవీ నటి భర్త ఆత్మహత్య.. కారణం అతడే...

టీవీ నటి భర్త ఆత్మహత్య.. కారణం అతడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ టెలివిజన్ నటి నందిని భర్త కార్తీకేయన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్తీకేయన్‌తో గతేడాది నందినీకి వివాహమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం రాత్రి చెన్నైలోని విరుంబాకంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Vamsam actress Nandhini's husband Karthikeyan commits suicide

కూల్ డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి సూసైడ్ చేసుకొన్నట్టు తెలిసింది. కార్తికేయన్ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. గత కొద్దికాలంగా కార్తీకేయన్ చెన్నైలో ఓ జిమ్‌ను నడుపుతున్నారు. అయితే ఆయన మృతికి మామ కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

శరవణన్ మీనాక్షీ సీరియల్ ద్వారా

శరవణన్ మీనాక్షీ సీరియల్ ద్వారా

విజయ్ టెలివిజన్‌లో శరవణన్ మీనాక్షీ సీరియల్ ద్వారా సుపరిచితులు. ఆ తర్వాత మైనా సీరియల్‌తో విశేష ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. టెలివిజన్ సీరియల్స్ కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నందిని నటించింది. వంశం, కేడి బిల్లా, కిలాడీ రంగా చిత్రాల్లో కనిపించింది.

న్యాయమూర్తిగా

న్యాయమూర్తిగా

పలు టెలివిజన్ సిరీస్ ప్రజాదరణ పొందిన నందిని ‘కలక పోవథు యారు సీజన్ 5' కార్యక్రమానికి న్యాయమూర్తిగా వ్యవహరించింది. 2016 జూన్ 5వ తేదీన కార్తీక్‌తో వివాహమైంది.

పెళ్లికి ముందు తమాషా సంఘటన

పెళ్లికి ముందు తమాషా సంఘటన

కార్తీక్‌తో పెళ్లికి ముందు తమాషా సంఘటన ఒకటి జరిగింది. తొలుత నందినిని వివాహం చేసుకొనేందుకు వచ్చిన కార్తీక్‌ను నందిని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనతో ప్రేమలో పడింది. అలా పెద్దలు కుదిర్చిన వివాహాన్ని ప్రేమ వివాహంగా మార్చుకొన్నది.

చనువు ప్రేమ వ్యవహారంగా

చనువు ప్రేమ వ్యవహారంగా

పెళ్లి చూపుల కోసం వచ్చిన కార్తీక్‌ ఇష్టంలేదని నందిని చెప్పింది. అయితే కార్తీక్ నడిపే జిమ్‌కు వెళ్లడం ప్రారంభించిన తర్వాత ఆయనతో చనువు ఏర్పడింది. ఆ తర్వాత వారి చనువు ప్రేమ వ్యవహారంగా మారింది. అనంతరం వారిద్దరూ గతేడాది పెళ్లి చేసుకొన్నారు.

English summary
Tamil television actress Nandini's husband Karthikeyan had reportedly committed suicide at a lodge in Virugambakkam, Chennai on Monday (April 3). The couple entered the wedlock last year in Madurai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu