కోల్‌కతాలో నాలుగో పెళ్లిపై వనితా విజయ్ కుమార్ క్లారిటీ.. అతడితో నాకు అదే రిలేషన్ అంటూ ఇన్స్‌టాలో పోస్ట్
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి బ్రేకప్ అయిందో లేదో అప్పుడే నాలుగో పెళ్లి అంటూ రూమర్లు ఊపందుకొన్నాయి. కోలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలపై వనిత నేరుగా సోషల్ మీడియాలో ఘాటైన సమాధానం ఇచ్చారు. పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు అంటూ ఓ వ్యక్తితో రిలేషన్ గురించి వస్తున్న గాసిప్‌పై వివరణ ఇస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

నటుడు సంజీవ్‌తో సెల్ఫీ
నటుడు సంజీవ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో కొద్ది రోజులుగా వనితా విజయ్ కుమార్ మళ్లీ రిలేషన్‌లో ఉంది తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. నాలుగోసారి కోల్‌కతాలో పెళ్లి చేసుకోనున్నారు అనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. దాంతో ఆ వార్త నిజమేనా అంటూ అభిమానులు, సినీ వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టారు.

రూమర్లను నమ్మకండి...
అయితే తన పెళ్లి గురించిన వార్తలు అదుపుతప్పుతున్నాయని గ్రహించిన వనిత విజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. నేను ఇంకా సింగిల్. మీడియాలో వస్తున్న రూమర్లకు చాలా దూరంగా ఉన్నాను. మీరు కూడా వాటిని నమ్మకండి అంటూ వనిత విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.

సంజీవ్‌తో నా రిలేషన్ ఏమిటంటే
అయినా సంజీవ్‌తో రిలేషన్‌షిప్ అంటూ మీడియాలో కథనాలు రావడం ఆగలేదు. దాంతో సంజీవ్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను బయటపెట్టారు. నటుడు సంజీవ్ నాకు బ్రదర్.. ఆయన పక్కన ఉన్న ప్రీతా సంజీవ్ నా వదిన అంటూ అసలు విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో మీడియా కథనాలకు ఒక్కసారిగా ఆమె పుల్‌స్టాప్ పెట్టారు.

సంజీవ్ ఎవరంటే
అంతేకాకుండా సంజీవ్ ఎవరో కాదు... నా తల్లి, ప్రముఖ నటి మంజులా సొంత చెల్లెలు శ్యామల కుమారుడు. నాకు అత్యంత ఇష్టమైన సోదరుడు అని వెల్లడించింది. సంజీవ్‌తో బంధాన్ని బయటపెట్టడంతో అనుమానాలన్నీ క్లియర్ అవ్వడంతో నెటిజన్లు వారి రిలేషన్‌షిప్‌పై లైకులు కొడుతూ ఆనందించారు.

బిగ్‌బాస్ సెలబ్రిటీలు.. సీతతో ఫోటోలు వైరల్
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన సన్నిహితుల పెళ్లికి హాజరైన వనితా విజయ్ కుమార్ బిగ్‌బాస్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగారు. అందులో సురేష్ చక్రవర్తి, సీత తదితరులు ఉన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వనితా విజయ్ కుమార్ తమిళ రియాలిటీ షో బిగ్‌బాస్ జోడిగల్ షో షూటింగుకు హాజరయ్యారు. ఈ షోకు రమ్యకృష్ణ జడ్జీగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











