For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వనితా విజయ్‌కుమార్ భర్తకు తీవ్ర అస్వస్థత: కరోనానే కాదు.. దేవుడూ విడదీయలేడు అంటూ ఎమోషనల్ ట్వీట్

  |

  తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే తన భర్త అనారోగ్యం పాలు కావడంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై వనిత పరోక్షంగా చురకలు అంటించే ప్రయత్నం చేశారు. మంగళవారం రాత్రి వరుస ట్వీట్లు చేసి తన భావావేశాన్ని వ్యక్తం చేశారు. జీవితమనే అశాశ్వతం.. ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ ఎమోషనల్ అయ్యారు. తాను చేసిన ట్వీట్లలో....

  ప్రేమను మంచి శక్తి మరోటి లేదు

  ప్రేమను మంచి శక్తి మరోటి లేదు

  బేషరుతగా దేవుడిని నమ్మాల్సిందే. పిల్లాడిని తల్లి ప్రేమించినంతగా అతడు మనల్ని ప్రేమగా చూసుకొంటాడు. ప్రేమపై అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ తల్లి ప్రేమను మించింది మరోటి ఉండదు. దేవుడితో నాకు అలాంటి బంధం ఉంది. జీవితం ఓ ప్రయాణం. నా ప్రయాణం సరైన దిశలోనే సాగుతున్నది అంటూ వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

  మీ జీవితాలను చక్కబెట్టుకోండి

  మీ జీవితాలను చక్కబెట్టుకోండి

  ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడకుండా మీ జీవితాన్ని సరిదిద్దుకొండి. లేకపోతే మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జీవితమనేది ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మీ జీవితం ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని సంబరపడకండి. ఏ ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేం. ఇతరులపై బురద జల్లే ప్రయత్నాలను ఆపి.. దేవుడిపై నమ్మకాన్ని పెట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడపండి అంటూ వనితా విజయ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు,

  జీవితంలో ప్రతీ రోజు ముఖ్యమే..

  జీవితంలో ప్రతీ రోజు ముఖ్యమే..


  జీవితంలో గడిచిన ప్రతీ రోజు ముఖ్యమే. గడిచిపోయిన రోజును మనం మరిచిపోకూడదు. ఏదైన సవాల్ ఎదురైనప్పుడు దానిని ఎదుర్కొనే శక్తిని భగవంతుడు మనకిచ్చాడు. ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను పరీక్షించడానికి దేవుడు పరీక్షలు పెడుతాడు. మా జీవితం గొప్పగా ప్రారంభమైంది. అద్భుతాలు చేస్తామనే నమ్మకం కలిగింది. అతడు నావాడు.. నేను అతడికి చెందిన.. దేవుడుకి ప్రతీ విషయంలో ఓ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ గురించి నాకు తెలుసు అని వనిత విజయ్ కుమార్ వరుస ట్వీట్లు చేశారు.

  కష్ట, సుఖాలు, ప్రేమ, ద్వేషాలతో

  కష్ట, సుఖాలు, ప్రేమ, ద్వేషాలతో

  జీవితంలో మంచి, చెడు, ఆరోగ్యం, అనారోగ్యం అన్నింటిని ఎదుర్కొంటానని బైబిల్ ప్రమాణం చేశాను. 2020 సంవత్సరంలో పీటర్ పాల్ ఎన్నో ఎమోషన్స్ ఎదుర్కొన్నారు. కష్టాలను, సుఖాలను పంచుకొన్నాం. ఒకరిపై ఒకరిని ద్వేషించుకొన్నాం. ప్రేమించుకొన్నాం. అయితే కరోనా వైరస్, విద్వేషకులు మమల్ని వేరు చేయలేవు అంటూ వనితా విజయ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ప్రేమించండి. జీవితాన్ని ఆస్వాదించండి

  ప్రేమించండి. జీవితాన్ని ఆస్వాదించండి

  మనసు ఊరట చెందే విధంగా సందేశాలు పంపిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. మీ గురించి కూడా మీరు జాగ్రత్త పడండి. జీవితమంటే మనమే కాదు.. మనతో ఉండే వాళ్లను కూడా ప్రేమించాలి. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి అంటూ వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.

  పీటర్ పాల్ ఆరోగ్యంపై రూమర్లు

  పీటర్ పాల్ ఆరోగ్యంపై రూమర్లు

  పీటర్‌ పాల్‌ను వివాహం చేసుకొన్న తర్వాత తమిళ సినీ పరిశ్రమలోని కొందరితో వనితా విజయ్ కుమార్‌కు వాగ్వాదం జరిగింది. కుట్టి పద్మిని, లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి శంకర్ లాంటి ప్రముఖులతో సోషల్ మీడియా వేదికగా రచ్చ జరిగింది. ఈ క్రమంలో పీటర్ కరోనాతో అనారోగ్యానికి గురయ్యారని వారు చేసిన కామెంట్లకు వనితా విజయ్ కుమార్ ఇలా సమాధానం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

  English summary
  Vanitha Vijayakumar husband Peter Paul fallen sick due to corona. Reports suggest that He was hospitalised with chest pain. In this occassion, Vanitha tweeted that, By the way stop concentrating on others path you will lose yours. life is unpredictable and anything can happen to anyone anytime. So dont think ur life is perfect and mock at others .god has a mean sense of humor and he loves entertainment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X