స్టార్ హీరోతో వనితా విజయ్ కుమార్ రొమాన్స్.. వివాదాలకు దూరంగా ఉంటూ..

తమిళ నటి వనితా విజయ్ కుమార్ వివాదాలకు దూరంగా ఉంటూ మళ్లీ తన కెరీర్‌పై దృష్టిపెడుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా వరుస సినిమాలతో తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ రీమేక్ కోసం కోలీవుడ్ సీనియర్ హీరోతో జతకట్టేందుకు సిద్దమయ్యారు. ఆ ప్రాజెక్టు ఏమిటి? ఆ హీరో ఎవరనే విషయాల్లోకి వెళితే...

మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

సూపర్‌స్టార్ విజయ్‌తో కెరీర్

సూపర్‌స్టార్ విజయ్‌తో కెరీర్

వనితా విజయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇళయ దళపతి విజయ్‌తో చంద్రలేఖ అనే చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మానిక్కమ్, కాకై సిరంజినిలే చిత్రాల్లో నటించింది. కెరీర్ ఊపందుకొంటుందనే సమయంలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు.

బిగ్‌బాస్‌ తమిళ్ 3 పాపులారిటీ

బిగ్‌బాస్‌ తమిళ్ 3 పాపులారిటీ

ఆ తర్వాత మ్యారేజ్ బ్రేకప్ కావడంతో మళ్లీ కెరీర్‌పై దృష్టిని సారించారు. ఆ క్రమంలో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించి బిగ్‌బాస్ తమిళం సీజన్ 3లో తన ప్రతిభను చాటుకొన్నారు. ఆ తర్వాత టెలివిజన్, యూట్యూబ్‌లో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

క్రేజీ ఆఫర్‌తో వనితా విజయ్ కుమార్

క్రేజీ ఆఫర్‌తో వనితా విజయ్ కుమార్

ప్రస్తుతం వనితా విజయ్ కుమార్ ఓ భారీ, క్రేజీ ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన అంధాదూన్ చిత్ర రీమేక్‌లో జీన్స్ ఫేమ్ ప్రశాంత్‌తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో సిమ్రాన్, యోగి బాబు, ఊర్వశి, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

పూర్వవైభవంపై ప్రశాంత్ దృష్టి

పూర్వవైభవంపై ప్రశాంత్ దృష్టి

ఇక ప్రశాంత్ కెరీర్ విషయానికి వస్తే.. తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. జీన్స్ లాంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగించిన ప్రశాంత్‌కు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం మళ్లీ తన కెరీర్‌పై దృష్టిని పెట్టారు.

ప్రముఖ నటుడు త్యాగరాజన్‌ డైరెక్షన్‌తో

ప్రముఖ నటుడు త్యాగరాజన్‌ డైరెక్షన్‌తో

బాలీవుడ్ చిత్రం అంధాదూన్‌ను తమిళంలో అంధఘన్ అనే చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగు చేస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రశాంత్, సిమ్రాన్, వనితా విజయ్ కుమార్ కెరీర్ గాడిన పడుతాయని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X