అమీర్ ఖాన్ ,కలాం లకు ప్రత్యేక చిత్ర ప్రదర్శన

ఇటీవల మానసికవైకల్యత కలిగిన పిల్లలపై అమీర్‌ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్' చిత్రం అనూహ్యంగా సంచలన విజయం సాధించి అందరి ప్రశంసలను అందుకుంది. ఇక కలాంలకు పిల్లల పట్ల ఎంతో ప్రేమాభిమానాలను కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఇరువురికి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలన్నది దర్శకుడు అజగప్పన్ అభిప్రాయం.
కథ ప్రధానంగా ఓ తాతకు... మనుమరాలి మధ్య జరిగుతుంది. వారి మధ్య చోటుచేసుకునే అంతరాలు ఉద్వేగ భరితంగా ఉంటాయి. ఈ సన్నివేశాలే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా చిత్రీకరించారు. నటుడు బాలాసింగ్ తాతగా నటించగా, తొమ్మిది సంవత్సరాల శ్రీ లక్ష్మీ పెదమనుమరాలి పాత్రలో జీవించింది. నటి రేవతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆముద భారతి కూడా ఓ పాత్రలో నటించింది. రేహెన్ స్వరకల్పన చేశారు.


Click it and Unblock the Notifications











