twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రాన్స్ జెండర్స్ తరుపున నిలబడిన స్టార్.. వారు కూడా మనుషులే.. కాస్త దయచూపండన్న వరలక్ష్మి

    |

    కరోనా వైరస్ ఎందరి జీవితాలను చిధిమేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారిని ఎదురించేందుకు విధించిన లాక్ డౌన్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఆ సమయంలో ఎంతో తిండి లేక అల్లలాడిపోయారు. ఇప్పటికీ లాక్ డౌన్ దెబ్బ తగ్గడం లేదు. ఎంతో మంది ఆకలికేకలతో అలమటిస్తున్నారు.

     ట్రాన్స్ జెండర్స్ కోసం.

    ట్రాన్స్ జెండర్స్ కోసం.

    లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై తిండికి కూడా కొట్టుమిట్టాడుతున్న వారి తరపున వరలక్ష్మీ శరత్ కుమార్ నిలిచింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడే కార్యకర్త గ్రేస్ భాను లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతో శ్రమిస్తోందని తెలిపింది. తూత్తుకుడిలోని ఎంతో మందికి సాయం చేస్తూ నిర్విరామంగా పని చేస్తోందని చెప్పుకొచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసర సరకులు, మందులు అందిస్తోందని పేర్కొంది.

    నిధులు అయిపోయాయ్..

    నిధులు అయిపోయాయ్..

    మొదటగా క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సాయం చేయడం జరిగిందని తెలిపింది. కానీ ఇప్పుడు నిధులు అయిపోయాయని, మీ అందరి సాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. వారి ఇంటి అద్దె, రేషన్ కోసం సాయం చేయండని కోరింది. తమిళ నాడులో ఉన్న దాదాపు 200 మంది ట్రాన్స్‌జెండర్స్‌క సాయం చేయండని పిలుపునిచ్చింది.

    అద్దె, రేషన్ కోసం..

    అద్దె, రేషన్ కోసం..

    కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు విధించిన మూడు నెలల లాక్ డౌన్ పూర్తయ్యాక వారి యోగక్షేమాలను గాలికొదిలేశారు. ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదు. ఇంటి యజమానులు అద్దెలు అడగడం ప్రారంభించారు. రేషన్ కూడా వారికి అందడం లేదు. వారికి పైగా ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా ఉండవు.

    Recommended Video

    Nadigar Sangam Election 2019 : Bharathi Raja controversial comments On Vishal || Filmibeat Telugu
    కాస్త దయచూపండి..

    కాస్త దయచూపండి..

    వీరే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వృద్దులు, హెచ్‌ఐవీ రోగులు, జానపద కళాకారులు ఇలా ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయినవారెంతో మంది ఉన్నారు. వీధి కార్మికుల జీవితాలు కూడా దుర్భరంగా ఉన్నాయి. వీరందరినీ కాపాడేందుకు మీకు తోచిన మొత్తం అది కొంచమే అని మీకు అనిపించినా పర్లేదు.. ఎంతో కొంత సాయం చేయండని కోరింది. వారు కూడా మనుషులే కాస్త దయచూపండని, మానవత్వాన్ని చాటుకోండని చెప్పుకొచ్చింది.

    English summary
    Varalakshmi Sarathkumar Wants To Help Transgenders. She says that Lets help our #transgender community of tamil nadu..plz help..as always the amount doesnt matter..every paisa helps..plz plz they are also human.they also have every right to survive, they are a part of our society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X