»   » విశాల్ విలన్ అయిపోతున్నాడని బాధతో మాట మార్చిందా?

విశాల్ విలన్ అయిపోతున్నాడని బాధతో మాట మార్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో విశాల్‌, హీరోయిన్‌ వరలక్ష్మిల లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. దాదాపు ఏడేళ్ల క్రితమే వారి ప్రేమకథకు రీసెంట్ బ్రేక్ లు పడ్డాయని, బ్రేకప్ వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వరలక్ష్మి చేసిన ఓ ట్వీట్‌ సంచలనం రేకెత్తించింది.

'ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వదులుకున్నాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి తన మేనేజర్‌ ద్వారా తెలియజేశాడు. ప్రపంచలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?' అంటూ వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్‌టాపిక్‌గా మారాయి.


విశాల్‌ పేరును ఆమె డైరెక్ట్‌గా ప్రస్తావించకపోయినప్పటికీ.. అతణ్ని ఉద్దేశించే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందని అందరూ అనుకుంటున్నారు. వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌తో గొడవల కారణంగానే విశాల్‌ ఆమెను వదిలేశాడని అందరూ చెప్పుకున్నారు. వరలక్ష్మి తండ్రి శరత్‌ కుమార్‌తో పడకపోయినా వరలక్ష్మిని విశాల్‌ గాఢంగా ప్రేమిస్తున్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వినిపిస్తున్న నేపధ్యంలో ఈ ట్వీట్ ఓ రేంజిలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

అయితే తాజాగా ఇంత హడావిడి జరిగాక వరలక్ష్మి తాపీగా మరో ట్వీట్ చేసింది. నా ట్వీట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను కేవలం నా పనిని మాత్రమే డేటింగ్ చేస్తాను. కాబట్టి అందరూ దయచేసి ఈ విషయం వదిలేయండి. ఆ ట్వీట్ నా గురించి కాదు, అది కేవలం ఓ ట్వీట్ అంతే అంది.

అయితే ఆమె విశాల్ తో డేటింగ్ చేస్తున్నానని చెప్పకుండా కేవలం పనిని మాత్రమే డేటింగ్ చేస్తున్నాను అని చెప్పటం మరోసారి చర్చ లేవదీసింది. దాంతో వరలక్ష్మి చాలా తెలివైందని, విశాల్ మనస్సులో ఉన్న విషయం చెప్పించటానికి ఇలా చేసిందని, ఆమె మహాముదురు అని తమిళ సినీ వర్గాలు, మీడియా వ్యాఖ్యానాలు చేస్తోంది.

ఈ ట్వీట్ ఏంటి

ఇలా ట్వీట్ చేసింది, అర్దమేంటో

 కామెడీ నా ప్రేమంటే

కామెడీ నా ప్రేమంటే

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ప్రేమ పరిహాసంగా మారిపోతోందని, ఏడేళ్ల ప్రేమను చాలా తేలిగ్గా వద్దంటున్నారని అదీ తన మేనేజర్‌తో చెప్పి పంపిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొనటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

 ఆందోళన, ఆవేదన

ఆందోళన, ఆవేదన

అసలు ప్రేమ ఏమైపోతుందోనన్న ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తను ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది క్లారిటీ లేకపోయినా, ఆమె వ్యాఖ్యలు మాత్రం మరోసారి కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు కేవలం విశాల్ ని ఉద్దేశించే ఆమె చేసిందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసారు.

 పాపులార్టీ

పాపులార్టీ

ఈ బ్యూటీ నటుడు శరత్‌కుమార్ కూతురన్న విషయం తెలిసిందే. విదేశాల్లో చదువుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి డ్యాన్సర్. ముఖ్యంగా కల్సా నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. పోడాపోడీఆ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ ఆ మధ్య విడుదలైన తారాతప్పట్టై చిత్రంతో మంచి ప్రాచుర్యం పొందారు. నటుడు విశాల్‌తో చెట్టాపట్టాలంటూ మరింతగా వార్తల్లో నిలిచారు. సినిమాల ద్వారా రాని పాపులార్టీ ఆమెకు విశాల్ తో లవ్ ఎఫైర్ తో వచ్చింది.

 బహిరంగ రహస్యమే..

బహిరంగ రహస్యమే..

తెలుగోడైన తమిళ హీరో విశాల్‌కు ఇప్పటికే 38 ఏళ్ల వయసొచ్చేసింది. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాలుగైదేళ్లుగా పెళ్లి ఇదిగో అదిగో అంటున్నాడు కానీ.. అవ్వట్లేదు. సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ తనయురాలైన వరలక్ష్మితో అతను ప్రేమలో ఉన్న సంగతి బహిరంగ రహస్యం. ఆమె కూడా 30 ప్లస్‌ లోకి వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

 చెప్పకనే చెప్పారనుకున్నారంతా

చెప్పకనే చెప్పారనుకున్నారంతా

ఐతే ఏనాడూ కూడా వీళ్లిద్దరూ తమ ప్రేమ గురించి బహిరంగంగా ఒప్పుకున్నది లేదు. కానీ ఇద్దరూ తరచుగా కలుస్తుంటారు. అందరి కళ్లలో పడుతుంటారు. ఈ మధ్య ఇద్దరూ కలిసి క్లోజ్‌గా ఉన్నపుడు ఓ సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని ట్విట్టర్లో షేర్‌ చేస్తూ 'దట్స్‌ ఇట్‌' అని కామెంట్‌ చేశాడు విశాల్‌. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ఇలా చెప్పకనే చెప్పాడనుకున్నారు అంతా.

 తలక్రిందులు చేసినట్లే

తలక్రిందులు చేసినట్లే

నడిగర్‌ సంఘం కోసం కళ్యాణ మండపం కట్టిస్తున్న విశాల్‌.. అందులో జరిగే తొలి పెళ్లి తనదే అని కొన్ని నెలల కిందట వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్‌ త్వరలోనే వరలక్ష్మిని ఆ కళ్యాణ మండపంలో పెళ్లాడతాడని అంతా చర్చించుకుంటుంటే.. సడెన్‌గా వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలతో అందరి అంచనాల్ని తలకిందులు చేసి పారసింది. దాంతో తమిళ పరిశ్రమలో ఇదో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

 మనస్సులో ఎవరూ లేరు

మనస్సులో ఎవరూ లేరు

గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని.. తన మనసులో ఎవరూ లేరని అంది. అంతటితో ఆగకుండా తన ప్రేమ, పెళ్లి అంతా సినిమాతోనే అని వ్యాఖ్యానించింది. దీంతో విశాల్‌ పెళ్లి వ్యవహారంలో ఈ కొత్త ట్విస్టు ఏంటో కోలీవుడ్‌ జనాలకు అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నారు.

 మామకు యముడన్నారు

మామకు యముడన్నారు

మామకు యముడు, అమ్మాయికు మొగడు అని విశాల్ లవ్ స్టోరీ ని కథలు,గాధలుగా తమిళ పరిశ్రమ గత కొంతకాలంగా చెప్తోంది. ఆ మధ్యన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్- విశాల్‌ల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. శరత్ కుమార్- విశాల్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో మాత్రం విశాల్ ప్రేమాయణం ఎంచక్కా సాగిపోతోంది. దీంతో హీరో విశాల్ ప్రేమాయణం సినీ ఇండస్ట్రీలో వెరైటీగా నిలిచిపోతోందనుకుంటే ఈ కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.

 పుట్టిన రోజేమో అలా...

పుట్టిన రోజేమో అలా...

విశాల్‌ పుట్టిన రోజునాడు ‘నా ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజే ఓ ఆస్పత్రిలో జరిగిన విశాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు హాజరై హంగామా చేసింది. కొత్తగా జన్మించిన 20 మంది చిన్నారులకు బంగారు ఉంగరాలు బహుమతులుగా ఇచ్చి పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది విశాల్- వరలక్ష్మి జంట.

 ఫ్యామిలీ మ్యాటర్స్ లో సైతం

ఫ్యామిలీ మ్యాటర్స్ లో సైతం

మరోవైపు రాధికా రెండో భర్త రిచర్డ్ హార్డ్‌కు జన్మించిన రేయాన్ రాధికకు కర్ణాటకు చెందిన క్రికెటర్ అభిమన్యు మిథున్‌కు ఇటీవల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు పాల్గొన్నారు. అయితే ఈ వివాహానికి శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి మాత్రం హాజరు కాలేదు. వరలక్ష్మి ప్రేమికుడు విశాల్‌కు నడిగర్ సంఘం వ్యవహారంలో రాధికా వ్యతిరేకంగా వ్యవహరించడంతో రాధికా కుమార్తె పెళ్ళికి వరలక్ష్మి హాజరు కాలేదని కోలీవుడ్‌ వర్గాల్లో వినపడింది.

తండ్రి కావాలి కానీ...

తండ్రి కావాలి కానీ...


వరలక్ష్మి శరత్ కుమార్ మొదటి భార్య కూతురు. వరలక్ష్మి తల్లి నుంచి విడిపోయి లేటు వయసులో రాధికను పెళ్లాడాడు శరత్. తండ్రి పేరును తన పేరు వెనకైతే పెట్టుకుంది కానీ.. శరత్‌తో వరలక్ష్మికి సరైన సంబంధాలు లేవని అంటారు. అలా టీవి తెరపైనే కాదు..నిజజీవితంలోనూ రాధిక పిన్నే. అయితే ఆ పిన్ని తో మాత్రం కూతురుకి రిలేషన్ లేదు.

 సహజీవనమా

సహజీవనమా

వరలక్ష్మి.. విశాల్‌తో కలిసి ‘ఎమ్జీఆర్' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు కానీ.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్నుంచి విశాల్, వరలక్ష్మి రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్తుందని అంతా భావించారు . కానీ ఇలా బ్రేకప్ షేప్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు.

 నా సపోర్ట్ మా నాన్నకే..

నా సపోర్ట్ మా నాన్నకే..

నడిగర్ సంఘం ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది విశాల్ వర్గం. విశాల్ పై భౌతిక దాడులు చేసి కొట్టుకునే వరకూ వ్యవహారం వెళ్లినా.. ఎన్నికలకు ముందు వరలక్ష్మి మాత్రం "నా సపోర్ట్ మా నాన్నకే" అనేసింది. దీంతో విశాల్ కొంత ఇబ్బంది పడ్డా.. ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తన వర్గానికి సంబంధించిన అందరినీ గెలిపించుకున్నాడు కూడా.

 విశాల్ దెబ్బకు స్ట్రోక్

విశాల్ దెబ్బకు స్ట్రోక్

వరలక్ష్మితో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన విశాల్.. ‘‘దట్స్ ఇట్'' అని వ్యాఖ్యానించాడు. అప్పట్లో విశాల్ ట్వీట్ చేసిన సమయంలోనే శరత్ కుమార్ అనారోగ్యం పాలవడం గమనార్హం. అతడికి హార్ట్ అటాక్ అని ప్రచారం జరిగింది. తర్వాతేమో ఫుడ్ పాయిజన్ వల్లే అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. ఐతే జనాలు మాత్రం విశాల్ ట్వీట్ వల్లే శరత్ అనారోగ్యం పాలయ్యాడంటూ చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతైనప్పటికీ విశాల్-వరలక్ష్మిల పెళ్లికి శరత్ ఆమోదం లేదన్నది మాత్రం నిజం.

ఆమె నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంతే..

ఆమె నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంతే..

ఇక మీరు ఎవరినో ప్రేమించారని వార్తలు వచ్చాయి? అని మీడియావారు విశాల్ అడిగితే.. వరలక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు. తనతో వస్తున్న గాసిప్స్‌ విషయంలో వాస్తవం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను అన్నారు. గతంలో విశాల్ ని పెండ్లి ముహూర్తం ఎప్పుడు? అని మీడియావారు అడిగితే... నడిగర సంఘం పనులతో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం మిస్‌ అవుతున్నాను. షూటింగ్‌, నడిగర్‌ సంఘంలో పనులతో చాలా బిజీగా ఉంటున్నాను. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇంకా నా మైండ్‌ పెళ్లికి సిద్ధంగా లేదు.

English summary
However, in a bid to clear the speculation, the actress Varalakshmi tweeted again. She said, ” Lots of speculation about my last tweet.. I’m dating only my work as of now.. so everybody calm down it’s not about me..It’s was jus a tweet.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu