»   » నిజం కాదంటూ త్రిష కాబోయే భర్త వివరణ

నిజం కాదంటూ త్రిష కాబోయే భర్త వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెట్‌ టీం (సీఎస్‌కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్‌ టీం కొంటున్నట్లు వచ్చిన వార్తలపై వరుణ్‌ ట్విట్టర్ లో స్పందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్ ట్వీట్ చేస్తూ.... ‘ఇపుడే నిశ్చితార్ధం జరిగింది, త్రిష నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం, ఏ టీం కొనే ఆలోచన లేదు, కాస్త ఏకాంతంగా వదిలేయండి' అని ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ వివాదంలో కూరుకున్న శ్రీనివాసన్‌ బీసీసీఐ అధికారిగా ఉంటూ, స్వంత క్రికెట్‌ టీం కలిగి ఉండడంపై సుప్రీంకోర్టు ఇటీవల విస్మయం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీసీసీఐ పదవికి అడ్డురాకుండా ఉండే విధంగా సీఎస్‌కె టీంను దగ్గరి వ్యక్తులకు అప్పగిస్తారనీ, ఇందుకు సమీప బంధువైన వరణ్‌ మణియన్‌ కూడా ఆసక్తి చూపాడని వార్తలు వెలువడ్డాయి. దీనిపై వరుణ్‌ అటువంటిదేమీ లేదని వివరణ ఇవ్వడంతో వచ్చే 16న జరుగనున్న ఐపీఎల్‌ వేలం నాటికి శ్రీనివాసన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనని క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

చెన్నై చిన్నది త్రిష, నిర్మాత వరుణ్‌ మణియన్‌ల నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. 1999లో 'మిస్‌ చెన్నై'గా ఎంపికైన త్రిష 2002లో తమిళ తెరకు పరిచయమైంది. 'వర్షం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు 12 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించింది.

ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో ఆడిపాడుతోంది. 'వాయై మూడి పేసవుం' చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన వరుణ్‌మణియన్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. శుక్రవారం ఉదయం వీరి నిశ్చితార్థం చెన్నై, ఆళ్వార్‌పేటలోని వరుణ్‌ మణియన్‌ ఇంట్లో జరిగింది. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Varun Manian denies plans to buy CSK

త్రిషను ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ముస్తాబు చేశారు. అనంతరం త్రిష, వరుణ్‌ ఉంగరాలు మార్చుకున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు నటీ నటులకు శనివారం విందు ఇచ్చింది.

అనుకున్నట్లుగా జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. చెన్నైలోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ పార్టీలో ఛార్మీ, మాధవన్, ధనుష్, శింబు, ఆర్య, సంగీత దర్శకుడు అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు.

శనివారం... ఈ ఎంగేజ్ మెంట్ పార్టీని ఘనంగా ఇచ్చింది. ఈ పార్టీకి త్రిష ఫ్రెండ్స్ మాత్రమే కాక సినీ పరిశ్రమ నుంచి ఛార్మీ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సెలబ్రెటీలు హాజరయ్యారు. త్రిష ఆ పార్టీలో చాలా ఆనందంగా కనిపించింది.

English summary
The young businessman was recently engaged to actress Trisha. Clearing the reports on buying CSK, Varun tweeted, "Just Engaged. No plans to buy any Team. LEAVE ME ALONE..."
Please Wait while comments are loading...