»   »  ‘వేలైకారన్’ సినిమా రిలీజ్ వాయిదా

‘వేలైకారన్’ సినిమా రిలీజ్ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా స్టూడియో 24 బేనర్లో తెరకెక్కుతున్న చిత్రం 'వేలైక్కారన్'. ఈ సినిమాపై తమిళనాడులో మంచి అంచనాలున్నాయి. రిలీజ్ ఎప్పుడా? అని శివకార్తికేయన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు.

ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సినిమా పూర్తికాక పోవడం, పోస్టు ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Velaikarran Movie release date postponed

దాసరా సీజన్లో వీలు కాలేదు కాబట్టి దీపావళి సీజన్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేద్దామంటే.... ఆ సమయంలో పలు పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్లో క్రిస్ మస్ సీజన్ వరకు సినిమాను వాయిదా వేయాలని, అప్పుడు రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 22న వేలైక్కారన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో శివకార్తికేయన్, నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీష్, ఆర్.జె బాలాజీ తదితరులు నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా ఇంతకు ముందు తమిళ సూపర్ ఫిల్మ్ 'తాని ఒరువన్' చిత్రాన్నికి దర్శకత్వం వహించారు.

English summary
The upcoming Velaikkaran movie produced by Studios24 had many fans waiting with bated breath for its release. At every step, this Sivakarthikeyan starrer film has received accolades from fans and members of the industry as well. However, Studios24 recently released a press note announcing that the release date of the movie has been postponed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu