twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Life of Muthu Twitter Review అద్బుతమైన గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరి.. శింబు, గౌతమ్ మీనన్ కెరీర్‌లో ది బెస్ట్

    |

    ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో ఇషారీ కే గణేష్ నిర్మించిన వెందు తానిందాథు కాడు (తమిళం) చిత్రం లైఫ్ ఆఫ్ ముత్తు టైటిల్‌లో తెలుగులో రిలీజ్ అవుతున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఇటీవల తెలుగు ఫిల్మీబీట్‌తో దర్శకుడు గౌతమ్ వాసుదేవన్ మీనన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే గ్యాంగ్‌స్టర్ ప్రేమకథ ఇది. రకరకాల ఎమోషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈ సినిమా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అన్నారు. అయితే తెలుగులో కంటే ముందుగానే తమిళంలో సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచి బ్రహ్మండమైన టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు ఈ విధంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    శింబు కెరీర్‌లో బెస్ట్ మూవీ


    దర్శకుడు గౌతమ్ మీనన్, శింబు కాంబినేషన్‌లో వచ్చిన లైఫ్ ఆఫ్ ముత్తు (తమిళంలో వెందు తానిందాథు కాడు) భారీ విజయాన్ని అందుకొన్నది. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గర్, బెటర్‌గా ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే బెస్ట్ మూవీ అవుతుంది. ముత్తుగా శింబు ఇరగదీశాడు. గౌతమ్ మీనన్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్బుతంగా మలిచాడు. ఏఆర్ రెహ్మన్ సంగీతం బాగుంది. నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆల్ ది బెస్ట్ అని నెటిజన్ తన రివ్యూ ఇచ్చాడు.

    STR అని ఎందుకు అంటారంటే?


    శింబును (సింగిల్ టేక్ రాజా) STR అని ఎందుకు అంటారో లైఫ్ ఆఫ్ ముత్తు చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో ముత్తు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొత్త అవతారంలో అదరగొట్టారు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడంలో ఎలాంటి అనుమానం లేదు. శింబు అనే పేరు మరిచిపోయి ముత్తు అనే పేరును గుర్తుంచుకొంటారు. ముత్తు పాత్ర కోసం అంతగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

    సినిమా చరిత్రలో బెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ


    లైఫ్ ఆఫ్ ముత్తు చిత్రంతో శింబు, గౌతమ్ వాసుదేవన్ మీనన్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జయమోహన్ అందించిన స్టోరి అద్బుతంగా ఉంది. సినిమా చరిత్రలో బెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి. అద్బుతమైన అనుభూతికి గురవుతారు అని నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

    రియలిస్టిక్‌ మూవీ అంటూ


    లైఫ్ ఆఫ్ ముత్తు అసాధారణమైన చిత్రం. చాలా రియలిస్టిక్‌గా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు. అంతే మొత్తంలో శింబు ఫెర్ఫార్మెన్స్ ఉంది. గౌతమ్ మీనన్‌తో కలిసి ఒక గొప్ప రచయిత పెన్ను విదిలిస్తే ఎలా ఉంటుందో జయమోహన్ నిరూపించారు అని ఓ నెటిజన్ ఈ సినిమాపై రివ్యూ అందించారు.

    లైఫ్ ఆఫ్ ముత్తు కల్ట్ క్లాసిక్


    లైఫ్ ఆఫ్ ముత్తులో శింబు నటన గురించి జయమోహన్ చెప్పిన విషయాన్ని నెటిజన్ ట్వీట్ చేశారు. రచయితగా జయమోహన్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ముత్తువీరన్‌గా శింబు 100 శాతం పాత్రలో జీవించాడు. శింబు కెరీర్‌లోనే లైఫ్ ఆఫ్ ముత్తు కల్ట్ క్లాసిక్. గౌతమ్ మీనన్ సినిమా కంటే భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్‌కు వెళ్లండి. మీరు తప్పకుండా సంతృప్తి చెందుతాడు. స్టోరి, డైరెక్షన్, ఏఆర్ రెహ్మన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయని చెప్పారు అని నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఇప్పటి వరకు కనిపించని పాత్రలో శింబు


    శింబు ఫ్యాన్స్‌కు శుభవార్త. లైఫ్ ఆఫ్ ముత్తు చిత్రంలో ఆత్మన్ శింబు ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించాడు శింబు కెరీర్ వీడియోను మీరు చూడండి.. ఆయన ఏంటో మీకు తెలుస్తుంది అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

    English summary
    Simbu, Gautham Vasudevan Menon combo comes with Life of Muthu. This movie has released on Life of Muthu. Here is twitter review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X