»   » సీనియర్ నటి మనోరమ అస్వస్థత... ఆస్పత్రిలో

సీనియర్ నటి మనోరమ అస్వస్థత... ఆస్పత్రిలో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Veteran actress Manorama hospitalized
చెన్నై : సీనియర్ నటీమణి మనోరమ (75) తీవ్ర అస్వస్థకు గురవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మూడుతరాల ప్రజలను తనదైన నటన, హాస్యంతో ఆకట్టుకుంటున్న నటి మనోరమ గత మార్చిలో శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. చికిత్సానంతరం ఆమె కోలుకోవడంతో ఇంటికి చేరుకున్నారు. గత నెల 26న ఆమెతన 77వ పుట్టినరోజును కుటుంబికుల నడుమ జరుపుకున్నారు.

ఈ నేపథ్యంలో మనోరమకు మంగళవారం సాయంత్రం మళ్లీ ఆరోగ్య సమస్య రావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రక్తంలో పొటాషియం తక్కువగా ఉందని, మరో రెండు రోజుల పాటు చికిత్స పొందుతారని వైద్యులు చెబుతున్నారు.

మనోరమ ఎంజీఆర్, ఎన్‌టీఆర్, శివాజీగణేశన్, ఏఎన్ఆర్‌ల నాటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. గత ఏడాది శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో అక్కడ స్నానాల గదిలో జారిపడి ఆమె తలకు గాయమైంది. అంతేగాక మోకాళ్లకు శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావడంతో ఆమె గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరమై ఇటీవలే ఓ సినిమాలో నటిస్తున్నారు.

మనోరమ సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించినది. ఈమె కొన్ని మళయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు.

1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. తెలుగులో భద్రకాళి, శుభోదయం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, రిక్షావోడు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి వంటి చిత్రాలలో కనిపించి అలరించారు.

త్వరగా ఆమె కోలుకుని తిరిగి కెమెరా ముందుకు పూర్తి ఆరోగ్యంతో వచ్చి నటించాలని 'వన్ ఇండియా తెలుగు' కోరుకుంటోంది.

English summary
Veteran actress 'Aachi' Manorama has been hospitalized following ill health. She looked fine and active for the past few months after having gone through a couple of minor surgeries in the last few years. We wish Manorama recovers soon and gets back to facing the camera!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu