»   » ప్రముఖ దర్శకుడు రామ నారాయణన్ మృతి

ప్రముఖ దర్శకుడు రామ నారాయణన్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ సిని దర్శకుడు, నిర్మాత రామ నారాయణన్(65) ఆదివారం సింగపూర్ లో ప్రెవేట్ హాస్పటిల్ లో మృతి చెందారు. కిడ్నికి చెందిన సమస్యలతో ఆయన గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ఆయన అంతిమ సంస్కారాలు సిటీలో జూన్ 24న జరుగుతాయని ఆయనకు చెందిన మీడియా మేనేజర్ తెలియచేసారు.

రామనారాయన్ తన కెరీర్ లో 125 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో ఎక్కువ చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శకుడుగా రికార్డు క్రియేట్ చేసారు. ఆయన సినిమాలు ఎక్కువ జంతువులు చుట్టూ తిరుగుతూండేవి. తెలుగులోనూ ఆయన రూపొందించన చిత్రాలు పెద్ద హిట్టయ్యాయి. ఆయన చివరి చిత్రం ఆర్య సూర్య. ఆయనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.

Veteran director and producer Rama Narayanan no more!

అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రాంనారాయణ దర్శకత్వంలో శ్రీ తేనాండాల్ ఫిలింస్ పతాకంపై తెలుగులో ఆ మధ్యన ఎన్.రాధ నిర్మిస్తున్న 'కారా-మజాకా' చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్టు చేయలేకపోయింది.

English summary
Tamil film director and producer Ramanarayanan, who is popular for making films featuring animal characters, passed away on Sunday at a private hospital in Singapore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu