»   » తమిళంలో హీరోయిన్‌గా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని..

తమిళంలో హీరోయిన్‌గా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని..

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివాని పరిచయం కానున్నారు. రాజశేఖర్‌, జీవిత దంపతులు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి వారసురాలిగా శివాని కోలీవుడ్‌లో తెరంగ్రేట్రం చేయనున్నారు.

ఎంబీబీఎస్ చదువుతూ..

ఎంబీబీఎస్ చదువుతూ..

ప్రస్తుతం శివాని ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నది. తన తొలి సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తానని మీడియాకు ఆమె తెలిపారు. సినిమాల కోసమే తాను భరతనాట్యం, కూచిపూడితో పాటు గిటార్‌, వీణ వాయించడం నేర్చుకున్నానని పేర్కొన్నారు. సినిమాల్లో నటించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నానని ఆమె అన్నారు

కుమ్కి2 చిత్రం ద్వారా

కుమ్కి2 చిత్రం ద్వారా

తాజా సమాచారం ప్రకారం శివానీ తమిళంలో రూపొందే కుమ్కి2 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. శివానీతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దాదాపు అగ్రిమెంట్‌పై సంతకం చేసే పని కూడా పూర్తి కావొచ్చింది. ఇటీవల స్క్రీన్ టెస్ట్‌గా కూడా చేసినట్టు సమాచారం. కొద్ది రోజుల్లోనే అధికారికంగా నిర్మాతలు ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది.

కుమ్కి సీక్వెల్‌గా

కుమ్కి సీక్వెల్‌గా

2012 సంవత్సరంలో తమిళంలో కుమ్కి రూపొందించింది. ప్రభు సాల్మన్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో కుమ్కి సంచలన విజయం సాధించింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభు దర్శకత్వం చేపట్టనున్నారు. కుమ్కి1 నటించిన విక్రమ్ ప్రభు ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కనిపిస్తున్నది. ఏనుగు, మావటికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా కుమ్కి సినిమా తెరకెక్కింది.

జూలై నుంచి సెట్స్ పైకి

జూలై నుంచి సెట్స్ పైకి

కుమ్కి చిత్రం జూలై నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. వర్షకాలం ప్రారంభమైన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తాం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో సినిమాను షూట్ చేస్తాం. ఈ చిత్రం భావోద్వేగమైన కథతో కూడుకొన్నదని నిర్మాతలు వెల్లడించారు.

శివానీ బాటలోనే చెల్లెలు శివాత్మిక

శివానీ బాటలోనే చెల్లెలు శివాత్మిక

శివాని సోదరి శివాత్మికకు కూడా సింగింగ్‌, కిక్‌ బాక్సింగ్‌లో ప్రావీణ్యం ఉంది. త్వరలోనే శివాత్మిక కూడా తన అక్కలాగే సినిమాల్లో రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై
రాజశేఖర్ దంపతులు కూడా అధికారికంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

English summary
Veteran Telugu actor Rajasekhar's daughter Shivani is likely to make her acting debut with upcoming Tamil film Kumki 2. Reports suggest that "The makers are in talks with her and are most likely to sign her. She has even given a screen test. It's just a matter of a few more days and an official announcement can be expected,"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu