Just In
- 8 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 39 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 1 hr ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
సుప్రీం ఒప్పుకున్నా సహాయనిరాకరణే ?పంచాయతీపై ఉద్యోగుల వ్యూహమిదే- అదెలా లీకైంది ?
- Finance
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Sports
India vs England: ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్?
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సవాల్ విసిరి... ప్రేమను చాటుకుంటోన్న నయన్ బాయ్ ఫ్రెండ్
సౌత్ సూపర్ స్టార్ నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమ ప్రయాణంపై పెదవి విప్పకపోయినా, ఇద్దరూ తమ పోస్టులతోనూ, పీడీయేతోనూ విషయాన్ని సుప్పష్టం చేస్తూనే ఉన్నారు. నానుమ్ రౌడీథాన్ సినిమా సెట్స్ పై చిగురించిన వీరి ప్రేమ, మొగ్గ తొడిగి నేటికి అయిదేళ్లు కావొస్తున్నా, లవ్ బర్డ్స్ ఇంకా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూనే ఉన్నారు. అయితే విఘ్నేశ్ తన ప్రేమను వ్యక్తం చేయడంలోనూ కళాత్మక ధోరణి ప్రదర్శిస్తున్నాడు. నయన్ కు సవాలు విసిరి ఆమె ప్రతిభను జనాలకు చూపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
నయనతార విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాదల్ అనే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, సమంత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లవ్ ట్రయాంగిల్ అయిన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్రా వేటికవే భిన్నంగా తీర్చిదిద్దుకున్నాడట విఘ్నేశ్. అయితే నయనతార పాత్రకు మరింత హైప్ తీసుకువచ్చేందుకు, ఇందులో ఆమెను అంధురాలిగా చూపించబోతున్నాడట.

గతంలో విఘ్నేశ్ డైరెక్షన్ లోనే నానుమ్ రౌడీథాన్ సినిమాలో నయన్ చెవిటి అమ్మాయిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఉందుకుంది. ఇక కాతువాకుల రెండు కాదల్ సినిమాలో అంధురాలిగా అమ్మడి పర్ఫార్మెన్స్ ఏ రేంజులో ఉండబోతుందా అని జనాలు ఎదురుచూస్తున్నారు. ఏమైనా విఘ్నేశ్ తన లవర్ కు ఛాలెంజింగ్ రోల్ ఇచ్చి మరోసారి అమ్మడి చేత బాక్సాఫీస్ షేక్ చేయించేందుకు సిద్ధమవుతున్నాడనే చెప్పాలి. మరి, ఆ అంచనాలు ఎంతవరకూ నిలబడతాయో చూడాలి.