50 లక్షలకి 14 కోట్లు.. సీక్వెల్ కి డైరెక్టర్ ని ప్రకటించిన మురగదాస్.. ఎవరంటే?

పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు అందించిన తమిళ డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు (పిచ్చైకారాన్) ముందు వరుసలో నిలుస్తుంది. తెలుగులో చాలా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా 2016లో బాక్సాఫీస్ హిట్స్ లో టాప్ ప్లేస్ లో స్థానం దక్కించుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండచ్చని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ ఉండగా ఈ విషయం మీద కొన్నేళ్ళ క్రితమే క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే దాని మీద ప్రకటన వచ్చింది. తమిళంలో కూడా విడుదలైన రోజు వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటుందని ఎవరు ఊహించలేదు.

ఇక ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు ఫస్ట్ లుక్కుతో చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గత ఏడాదే ఇచ్చింది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యి అనేక సంచలన రికార్డులు బద్దలు కొట్టింది. మన విక్టరీ వెంకటేష్ తో అప్పట్లో శీను అనే సినిమా డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు శశి బిచ్చగాడు సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగానే కాకుండా సంగీతం కూడా అందించాడు. ఇక ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు ఆయన దర్శకుడిగా కూడా మారబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమా దర్శకుడిని పరిచయం చేశారు.

Vijay Anthony turns director for Bichagadu 2

ఆసక్తికరంగా ఈ సినిమాకు విజయ్ అంటోనీ దర్శకత్వం వహించనున్నారు. ఇక విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లోనే ఈ చిత్రం నిర్మించబడనుంది. నిజానికి 2016లో తెలుగులో బిచ్చగాడు పేరుతో సినిమాను రిలీజ్ చేసిన రోజుల్లో పాజిటివ్ టాక్ రావడంతో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అలా ఈ సినిమా దాదాపు 14 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు కూడా తెలుగు మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మురుగదాస్ ఈ విషయాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి ఏమవుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X