»   » అమలా పాల్ కోసం విజయ్ మతం మార్చుకుంటారా?

అమలా పాల్ కోసం విజయ్ మతం మార్చుకుంటారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ మతానికి చెందిన అమలా పాల్ కుటుంబ సభ్యులు తమ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరుగాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్‌పై కూడా మతం మార్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 7న ఎంగేజ్మెంట్, జూన్ 12న వివాహా తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ కొచ్చిలో, వివాహం చెన్నైలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమలా పాల్ కేరళకు చెందిన వ్యక్తి కావడంతో తమ స్వస్థలంలో ఎంగేజ్మెంట్ జరుపాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇక దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. 2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన 'నాన్న') షూటింగులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Vijay To Convert To Christianity For Amala Paul?

అమలా పాల్‌పై ప్రేమ పెంచుకున్న దర్శకుడు ఎఎల్ విజయ్....తమిళ హీరో విజయ్‌తో తీసిన 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు. గతంలో వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన చాలా మంది విషయాన్ని బయటకు లీక్ చేసారు. మీడియాలో కూడా ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వారు ఈ విషయాన్ని అంగీకరించక పోగా, తమ మధ్య అలాంటిదేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేసారు.

అమలా పాల్-ఎ.ఎల్. విజయ్ పెళ్లి విషయాన్ని అమలా పాల్ తల్లి అనీస్ పాల్ ఓ మేగగైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తన కూతురు అమలా పాల్ దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయాన్ని తాను ఎలా తెలుసుకున్నాననే విషయాన్ని అనీస్ పాల్ సదరు మేగజైన్‌కు వివరించారు.

అమలా పాల్ ఫోన్ బిల్లు పరిశీలించిన అనీస్ పాల్ అందులో...ఎక్కువ కాల్స్ దర్శకుడు విజయ్‌తో మాట్లాడినట్లు ఉంది. అయితే విజయ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో అమలా పాల్ నటించడంతో తొలుతు ఆమెకు పెద్దగా అనుమానం రాలేదు. ఆ తర్వాత అమలా పాల్ వ్యవహారం పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. దర్శకుడు విజయ్‌తో ఎఫైర్ నడుపుతున్న విషయం ఇంట్లో తెలియడంతో తమను అమాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందని....ఆ తర్వాతా తాము ఒప్పుకోక తప్పలేదని అనీస్ పాల్ చెప్పుకొచ్చింది.

English summary
Director Vijay seems to be the latest celebrity from Tamil film industry, who is set to change his religion. In the recent months, we have read about Yuvan Shankar Raja and actor Jai converting to Islam. Now, the director of Thalaivaa is also converting and it is for none other than his sweetheart Amala Paul.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu