»   » రచ్చ మొదలైంది: ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మళ్లీ వార్!

రచ్చ మొదలైంది: ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మళ్లీ వార్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హీరోలు హీరోలు బాగానే ఉంటారు, అభిమానులే అనవసరమైన బేషజాలకు పోయి గొడవలు పెట్టుకుంటారు. ఒకప్పుడు తెలుగులో ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. హీరోలు ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని అభిమానుల మధ్య ఎలాంటి విబేధాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా 'కాలా' ట్రైలర్ విడుదల తర్వాత రజనీకాంత్ అభిమానులు, విజయ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.

  వివాదం దేనికి?

  వివాదం దేనికి?

  ‘కాలా' ట్రైలర్లో కొన్ని సీన్లు చూసిన విజయ్ అభిమానులు.... ఇందులోని కొన్ని షాట్లు ‘మెర్సల్' మూవీ నుండి కాపీ కొట్టి తీశారంటూ గొడవకు తెరలేపారు. రజనీకాంత్ అభిమానులు కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇవ్వడంతో ఈ ఫైట్ మరింత ముదిరింది.

  ఆ సీన్లను చూపి నానా రభస

  ‘కాలా' ట్రైలర్లో రజనీకాంత్ హోలీ ఆడుతున్న సీన్ ఉంది. అయితే మెర్సల్‌లో ఇలాంటి సీన్ ఆల్రెడీ చేశారని, ఫ్రేమ్‌లో కూడా ఏమాత్రం తేడా లేకుండా ఈ సీన్ కాపీ కొట్టారని విజయ్ అభిమానులు నానా రచ్చ మొదలు పెట్టారు.

   రజనీ స్థాయికి విజయ్ సరితూగడు అంటూ కౌంటర్

  రజనీ స్థాయికి విజయ్ సరితూగడు అంటూ కౌంటర్

  అయితే రజనీకాంత్ అభిమానులు ఏమాత్రం దగ్గకుండా కౌంటర్స్ ఇస్తున్నారు. రజనీ స్థాయికి విజయ్ ఏ మాత్రం సరిపోడని, సూపర్ స్టార్ స్టైల్ ముందు, రెపుటేషన్ ముందు విజయ్ ఎందుకూ పనికి రాడంటూ వారి విమర్శలను తిప్పి కొడుతున్నారు.

  జూన్ 7 వస్తున్న ‘కాలా'

  జూన్ 7 వస్తున్న ‘కాలా'

  జూన్ 7న ‘కాలా' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. నానా పాటేకర్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముఖ్యపాత్ర పోషిస్తోంది.

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేస్తున్న రెండవ సినిమా ఇది. తొలి మూవీ సంచలన విజయం సాధించడంతో ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతోంది.

  English summary
  A section of Vijay fans has taken potshots at Rajinikanth's Kaala, stating that a scene in the upcoming film is inspired by Mersal. This triggered debate among the fans of both the actors on social media. "The Holi shot or the Red powder shot in a song or scene of a movie has become pretty common these days !! What people don't understand is the fact that they will never be able to do better than #Mersal whatsoever !! The benchmark is already set !! [sic]" a Vijay fan tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more