»   » పాపులర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ పై అల్లుడు దాడి

పాపులర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ పై అల్లుడు దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Kumar
తమిళ, తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన విజయ్ కుమార్ తన అల్లుడుతో వేధింపులకు గురి అవుతున్నారు. తనపై దాడికి ప్రయత్నించాడంటూ విజయ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అల్లుడు రాజన్ ‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ కుమార్ పెద్ద కుమార్తె వనిత హీరోయిన్ ‌గా ఎదుగుతున్న సమయంలో ఆమె రాజన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని నటనకు స్వస్తి పలికారు. అయితే ఆ బంధ ఎంతో కాలం నిలబడలేదు. దాంతో తన పిల్లలతో కలసి చెన్నైలోని ఓ అపార్ట్ ‌మెంట్ ‌లో వనిత ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది.

ఈ నేపథ్యంలో తండ్రి విజయ కుమార్ తన పిల్లలను నిర్భందించారంటూ గత వారం ఆమె మదురవాయిల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి విజయకుమార్, సోదరుడు అరుణ్ కుమార్ తనను వేధిస్తున్నారంటూ పోలీసుల ఎదుట వనిత గగ్గోలు పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో ప్రక్క వనిత భర్త రాజన్ తమపై దాడికి యత్నించారంటూ రెండు రోజుల క్రితం విజయకుమార్ అదే పోలీసు స్టేషన్ ‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు మంగళవారం రాజన్‌ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. రాజన్ ‌ను వనిత వెనకేసుకురావడం గమనార్హం. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు స్పందించని పోలీసులు తన తండ్రి ఫిర్యాదుపై త్వరగా స్పందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందామె.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu