»   »  పొగతాగే సీన్లు చేయడట!

పొగతాగే సీన్లు చేయడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమణి రాందాస్ ఒక మంచి పని చేశాడు. వివరాలలోకి వెళితే... సినిమాలలో సిగరెట్లు తాగే సీన్లు చేయడం హీరో విజయ్ మానుకోవాలని అన్బుమణి హీరో విజయ్ ను కోరాడు..అందుకు విజయ్ సానుకూలంగా స్పందించాడు...ఇక నుంచి చేసే సినిమాలలో సిగరెట్లు తాగే సీన్లు లేకుండా చూసుకుంటాను...అన్నాడు.
ఇటీవల విజయ్ నటించిన సినిమా అజగియా తమిజ్ మగన్ సినిమాలో పొగతాగే సీన్లు ఉండడాన్ని చూసిన అన్భుమణి ఈ అభ్యర్థన చేశాడు. అందుకు విజయ్ పాజిటివ్ గానే స్పందించాడు. తదుపరి నటించనున్న సినిమా కరువి సినిమాలో పొగతాగే సీన్లు లేకుండా చూడాలని ఆ చిత్ర దర్శకుడిని విజయ్ కోరాడు. ఈ విషయం తెలిసిన మంత్రి విజయ్ కు ధన్యవాదాలు కూడా తెలిపాడు. విజయ్ బాటలో మిగతా హీరోలు కూడా వెళితే చాలా బావుంటుందని అన్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X