»   »  ఫస్ట్ లుక్ కు సూపర్ స్పందన

ఫస్ట్ లుక్ కు సూపర్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ పవర్ స్టార్ విజయ్‌ తన యాబై తోమ్మిదవ చిత్రానికి 'థేరి' అనే టైటిల్‌ని ఖరారు చేసి, బుధవారం ప్రకటించారు. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం చేస్తున్నారు.

విజయ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కి దాదాపు వేల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి, పోష్ట్ చేసిన కోద్ది నిమిషాలకే...
ఈ స్ధాయిలో స్పందన వచ్చి లైక్స్‌ రావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

Vijay's 59th movie First Look

ఇక ఈ చిత్రంతో ప్రముఖ సినీ నటి మీనా కూతురు నైనిక వెండి తెరకు పరిచయం కాబోతోంది.కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్‌ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో తల్లిగా నటిస్తోంది. ఇంతకు ముందు సమంత మనం తెలుగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఈసారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించబోతోంది.

Vijay's 59th movie First Look

హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న సమయంలో తల్లి పాత్ర ద్వారా సాహసం చేసిన తర్వాత మళ్లీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదని అనుకుందట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని కోలీవుడ్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తోంది.

English summary
Hero Vijay's latest film's First Look posters always stun the audiences. Titled "Theri", this film is being directed by Atlee of "Raja Rani" fame.
Please Wait while comments are loading...