»   » పెద్ద హీరో కాపీ....ఒరిజనల్ ఇదిగో(వీడియో)

పెద్ద హీరో కాపీ....ఒరిజనల్ ఇదిగో(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గతంలోలాగ పరిస్ధితులు లేవు. ఎక్కడైనా ఏదైనా ప్రేరణ పొందినా, లేక కాపీ కొట్టినా ఇట్టే క్షణాల్లో అది విశ్వవాప్తమయిపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలను చాలా నిశిత దృష్టితో అందరూ పరిశీలిస్తున్నారు. ఇంటర్ నెట్ రోజుల్లో ఏదీ దాచటానికి సాధ్యం కావటం లేదు. ఇప్పుడు అలాంటి కాపీ సమస్యనే తమిళ స్టార్ హీరో విజయ్ కత్తి చిత్రం ఫస్ట్ లుక్ ఎదుర్కొంటోంది. రీసెంట్ గా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ...2010లో విడుదలైన ఓ టీవీ కమర్షియల్ యాడ్ నుంచి కాపీ కొట్టారని అంతటా వినిపిస్తోంది. ఆ రెండు వీడియోలు మీరే చూసి నిర్ణయించండి... మొదటగా కత్తి చిత్రం ఫస్ట్ లుక్ వీడియో...

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/IB1NoiN_SR0" frameborder="0" allowfullscreen></iframe></center>


దీని ఒరిజనల్ అని చెప్పబడుతున్న టీవీ కమర్షియల్...

'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని విడుదల చేసారు. 

ఈ నేపథ్యంలో షూటింగ్ ముగియడంతో తన యూనిట్‌కు విజయ్‌ విందు ఏర్పాటు చేశారు. విజయ్‌ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

Vijay's 'Kaththi' first look copied


ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

English summary
&#13; The first look of actor Vijay's upcoming flick 'Kaththi' directed by AR Murugadoss was revealed , on the star actor's birthday. The motion poster that was released along with a couple of still posters, seems to be a copy of Sabah Newspaper TV Commercial that was released in 2010.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu