For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కథ కాపీ కొట్టారంటూ కోర్టు కెక్కారు

  By Srikanya
  |

  చెన్నై : తమ కథని కాపీ కొట్టే చిత్రం తీసారంటూ చాలా సార్లు పెద్ద హీరోలు లేదా పెద్ద దర్శకుల సినిమాలకు రిలీజ్ కు ముందు సమస్యలు ఎదురౌతూంటాయి. ఎప్పుడో కానీ ప్రూవ్ కానీ ఈ కేసుల సమస్య ఇప్పుడు మురుగదాస్ తాజా చిత్రం కత్తి కి ఎదురౌతోంది. గతంలోనూ తుపాకి చిత్రానికి సైతం కాపీ ఆరోపణలు ఎదుర్కొని క్లీన్ గా బయిటపడ్డ మురగదాస్ ఈ సారి అలాంటి పరిస్దితే ఎదుర్కోవాల్సి రావటంతో తమిళ పరిశ్రమ ఆశ్చర్యంగా చూస్తోంది.

  విజయ్, సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న కత్తి త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రం తమ కథనే కాపీ కొట్టి తీసారంటూ తిరువల్లూరు కి చెందిన మింజూర్ అనే వ్యక్తి కేసు వేసారు. తను రూపొందిస్తున్న మూత కుడై అనే చిత్రం కథనే తస్కరించాడంటూ కత్తి చిత్రం రిలీజ్ ని ఆపాలంటూ కోర్టులో పిటీషన్ వేసాడు. అయితే ఈ విషయమై మురుగదాస్ వెంటనే స్పందించారు. తనకు అసలు మింజూర్ అనే వ్యక్తి ఎవరో తెలియదని, కేవలం ఇవలన్నీ జనం అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి చేస్తున్న ట్రిక్ అనే కొట్టిపారేసారు.

  మరో ప్రక్క దర్శకుడు శంకర్‌తో పోటీ పడేందుకు ఏఆర్‌ మురుగదాస్‌ 'కత్తి'ని సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను కూడా ఎట్టిపరిస్థితుల్లో దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్లో వచ్చిన 'తుప్పాక్కి' భారీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు మురుగదాస్‌. దీంతో ఈ దీపావళి ఏకంగా రూ.300 కోట్ల పైచిలుకు వినోదాన్ని అందించేందుకు కోలీవుడ్‌ సిద్ధమవుతోంది.

  Vijay’s Kaththi hit by plagiarism charges!

  ఇక 'కత్తి' విశేషాలు కి వస్తే...

  'జిల్లా' తర్వాత 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కత్తి'. 'తుపాక్కి' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారాయన. ఇందులో తొలిసారిగా విజయ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ముంబయిలో పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో స్లీపర్‌సెల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'తుపాక్కి' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

  దీంతో మురుగదాస్‌ అంటేనే వందకోట్ల మార్కెట్‌ను సునాయాసంగా ఛేదించగలడనే నమ్మకం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బలంగా నాటుకు పోయింది. ఆ దిశగా ఈ సినిమా కూడా వందకోట్లను వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పోస్టర్లు, టీజర్‌లు కూడా మంచి ఆదరణను సంపాదించుకున్నాయి.

  విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్లలో విజయ్‌ భిన్నంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన భవనాలతో కూడిన చెన్నైని చూపుతూ.. ఆ సన్నివేశం విజయ్‌ ముఖం మాదిరిగా ముగిసేలా వచ్చిన టీజర్‌కు 'కత్తి'లాంటి రెస్పాన్స్‌ వచ్చింది. మరి 'కత్తి' వసూళ్ల విషయంలో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో వేచిచూడాల్సిందే.

  English summary
  A person named Minjur from Tiruvallur district has recently filed a case against AR Murugadoss claiming that the director has stolen his story for his forthcoming Tamil movie Kaththi. The plaintiff, in the petition, has said that the director has ripped off the story from his forthcoming movie Mootha Kudi and requested the court to pass an order, which will halt halt the making of Vijay’s film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X