»   » శ్రీదేవి అదరకొట్టింది : విజయ్ 'పులి' ట్రైలర్ (వీడియో)

శ్రీదేవి అదరకొట్టింది : విజయ్ 'పులి' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజరు లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న 'పులి'. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో శ్రీదేవి,సుదీప్, విజయ్ అదరకొట్టారు. ఆ ట్రైలర్ ఇదిగో...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళంలో ఎన్నో చిత్రాలకు బాణీలు అందించిన దేవిశ్రీ ఈ చిత్రం విడుదలకాకముందే ప్రశంసలు అందుకుంటున్నారు. డిఫరెంట్ కథాంశంతో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుతున్న ఈ చిత్రంలోని పాటలు విని నిర్మాతలు దేవిశ్రీప్రసాద్‌ను అభినందించారు. ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించారట.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- విజయ్‌తో సినిమా అంటేనే చాలా హైప్‌లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ‘పులి' అనే పేరును ప్రకటించగానే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను కంపోజ్ చేశాను. అందులో ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. మరోపాట సాగుతోంది. మూడోపాట రికార్డింగ్ దశలో ఉంది. విజయ్‌ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపేలా ఈ చిత్రం ఉంటుంది. ఫాంటసీ చిత్రమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్‌కాకుండా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలో ఓ అద్భుతాన్ని సృష్టిస్తోంది. నేను కూడా ఈ చిత్రం విడుదలకోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

 Vijay's Puli trailer

శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
Watch the super stunning trailer of Ilayathalapathy Vijay's Puli also starring Sridevi Boney Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!
Please Wait while comments are loading...