ఆడవేషంలో ఉన్న హీరోను గుర్తుపట్టగలరా? వైరల్‌గా విలక్షణ నటుడి ఫోటో
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ముద్ర వేసుకొని రాణిస్తున్న హీరో విజయ్ సేతుపతి. విక్రమ్ వేద లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ఇటీవల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం సూపర్ డీలక్స్. ఈ చిత్రంలో లింగమార్పిడి చేసుకొన్న వ్యక్తి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం తన రూపురేఖలను ఎవరూ గుర్తుపట్టనంతగా మార్చుకొన్నాడు.
తాజాగా లింగమార్పిడి (ట్రాన్స్‌జెండర్) చేసుకొని ఆడవేషంలో ఉన్న విజయ్ సేతుపతి ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో విస్తృతంగా ర్వీట్వీట్లతో హంగామా చేస్తున్నది. విజయ్ సేతుపతి మేకోవర్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న సూపర్ డీలక్స్‌లో సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్నది. విజయ్ సేతుపతితో సమంత నటించడం ఇదే తొలిసారి.

ఇంకా సూపర్ డీలక్స్ చిత్రంలో ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ శేఖర్, త్యాగరాజన్ కథను అందించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











