ఆహాలో రానున్న ‘విజయ్ సేతుపతి’ మూవీ: స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన సంస్థ
విలక్షణమైన నటనతో.. విభిన్నమైన శైలితో తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. పేరుకు తమిళ హీరోనే అయినా.. అద్భుతమైన నైపుణ్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు. తద్వారా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ సేతుపతి నటించిన చిత్రాల్లో 'సంగతమీజన్' ఒకటి. తెలుగులో ఇది 'విజయ్ సేతుపతి' అనే టైటిల్‌తో విడుదలైన విషయం తెలిసిందే.
కోలీవుడ్ డైరెక్టర్ బాలచందర్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన చిత్రమే 'సంగతమీజన్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మాస్ ఎంటర్టైనర్‌గా గతేడాది నవంబర్ 15న వచ్చి.. తమిళంలో బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది ఈ చిత్రం. అదే సమయంలో తెలుగులోనూ అలాంటి తరహా ఫలితాన్ని అందుకుంది.

ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ 'విజయ్ సేతుపతి'ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో మే 14న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సదరు సంస్థ నుంచి ఓ ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదలైంది.
తెలుగులో ఈ మధ్య వచ్చిన 'ఉప్పెన'లో నెగెటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి.. అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఈ కారణంగానే ఆయన సినిమాలను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇక, ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'సంగతమీజన్' సినిమాలో రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











