ఫ్యాన్స్‌పై విజయ్ సేతుపతి ఫైర్.. ఇదేం అభిమానం అంటూ మండిపాటు

వరుస విజయాలతో, అద్భుతమైన నటనతో ఆకట్టుకొంటున్న విజయ్ సేతుపతి కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. తుగ్లక్ దర్బార్ అనే సినిమా శనివారం చెన్నైలో ప్రారంభమైంది. గాయత్రి, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి విజయ్ సేతుపతి, అధితి, గాయత్రి, పార్తీపన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనపై విజయ్ సేతుపతి అసంతృప్తికి లోనయ్యాడని చెన్నై సినీ మీడియా కథనాలు వెల్లడించింది.

పూజా కార్యక్రమం సందర్భంగా చిత్ర యూనిట్, అభిమానులు భారీ ఎత్తున్న పటాకాయలు పేల్చారు. అభిమానులను వద్దని చెప్పినా వినకుండా అదే తీరును కొనసాగించడంతో మందలించాడట. అయినా అదే జోష్‌ను కొనసాగించడంతో విజయ్ సేతుపతికి చిర్రెత్తుకొచ్చిందట. ఇలాంటి పనులను ఇక ముందు చేయవద్దని చెప్పారట. పటాసులు కాల్చడం ఎవరి ఐడియానో ఏమో తేలిదు కానీ.. నేను చాలా అప్‌సెట్ అయ్యాను అని అన్నారు.

Vijay Sethupathi upset at Tughlaq Durbar opening event

విజయ్ సేతుపతి నటించిన ఇదమ్ పొరుల్ ఇవల్, సంగా తమిజాన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే కడైసి వివసాయి, లాబమ్, సైరా నర్సింహరెడ్డి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అదితి రావు తాజాగా అంతరిక్షం అనే చిత్రంలో నటించింది. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ నటించే చిత్రంలో కనిపించబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X