»   »  పరువు పోయిందిగా... అందుకే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ!

పరువు పోయిందిగా... అందుకే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వాళ్లు రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇందులో సక్సెస్ అయింది కొందరు మాత్రమే. వెండి తెరపై నెం.1 స్టార్లుగా వెలిగిన కొందరు రాజకీయాల్లో మాత్రం అంతగా రాణించలేక పోతున్నారు.

రాజకీయాల్లో పరాజయం పాలై పరువు పొగొట్టుకున్న స్టార్స్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం లాంటి ఇటీవల చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళ స్టార్ విజయ్ కాంత్ కూడా ఇదే బాట పడుతున్నారు.

Vijayakanth's re entry in Movies

ఒకప్పుడు తమిళనాట స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన విజయ్ కాంత్ తర్వాత రాజకీయల్లోకి వెళ్లడం, ద్రవిడ మున్నేట్ర కళగం అనే పార్టీ పెట్టి, 2011 తమిళనాడు ఎన్నికల్లో 29 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతాననే ధీమాతో వీర్రవీగిన విజయ్ కాంత్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. పైగా తాను పోటీ చేసిన నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకున్నారు.

ప్రస్తుతం రాజకీయాలు చేసే పరిస్థితి లేక పోవడంతో సినిమాల్లో నటించడం ద్వారా కనీసం తన గుర్తింపును కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ విషయాన్ని విజయ్ కాంత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మన విజయం మరికొంత ఆలస్యం అవుతోంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. మనం అధికారాన్ని చేపడతాం. ప్రస్తుతం తాను తమిళన్ ఎండ్రు సోల్ చిత్రం మీద ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.

English summary
Tamil actor Vijayakanth's re entry in Movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu