»   » నా లోటును నా కుమారుడు తీరుస్తాడు

నా లోటును నా కుమారుడు తీరుస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రస్తుతం సినిమాల్లో నటించాలని లేదని నటుడు 'కెప్టెన్‌' విజయకాంత్‌ తెలిపారు. తమ పార్టీ డీఎండీకేలో ఉత్తేజాన్ని నింపడానికి ఆయన 'ఉంగలుడన్‌ నాన్‌' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా కార్యకర్తలతో మమేకమై.. వారితో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కోయంబత్తూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ఇటీవల సేలంలో జరిగింది.

అక్కడి ఫైవ్‌వేస్‌ రోడ్‌ జంక్షన్లోని కల్యాణమంటపం దీనికి వేదికైంది. డీఎండీకే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ విభాగాల కార్యదర్శులు, కార్యకర్తలు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మున్ముందు సినిమాల్లో నటిస్తారా... అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ''సినిమాల్లో నటించి నాలుగేళ్లయింది. ఇకపై నటించాలని లేదు. ఆ లోటును నా కుమారుడు తీరుస్తాడు''ని పేర్కొన్నారు.

Vijayakanth want to quit acting


అనంతరం పార్టీ కార్యకర్తలు విజయకాంత్‌తో ఫొటోలు దిగారు. 2016లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపైనా సమావేశంలో చర్చించారు. డీఎండీకేను తాకట్టు పెట్టినట్టు కొందరు చెబుతున్నారని, తన పార్టీలో ఉన్న ఒక్క కార్యకర్తను కూడా తాకట్టు పెట్టనని చెప్పారు. 2016లో డీఎండీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Vijayakanth said " In fact, it is cinema which took me to the people. I will not continue to act and at the same without any compromise to public work."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu