»   » అల్లు అర్జున్ హీరోయిన్ ... జాతీయ అవార్డు నటుడు విక్రమ్ తో ...

అల్లు అర్జున్ హీరోయిన్ ... జాతీయ అవార్డు నటుడు విక్రమ్ తో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ సరసన వేదం చిత్రంలో నటించిన దీక్షాసేధ్ ని మర్చిపోవటం కష్టమే. తెలుగులో గోపీచంద్ వాంటెడ్, రవితేజ మిరపకాయ చిత్రాలతో బిజీగా మారిన ఆమె ఏకంగా విక్రమ్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఖలేజా, పులి చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఆమెను విక్రమ్ కి జోడీగా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలియచేస్తూ...విక్రమ్‌ చేసే విభిన్న చిత్రాల స్థాయిలోనే ఈ సినిమా కడా వైవిధ్యంగా ఉంటుంది. అలాగని కమర్షియల్ విలువలు ఎక్కడా మిస్ కానివ్వము.

మార్చి 1 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం యవన్ శంకర్ రాజా నేతృత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయ అన్నారు.ఇక ఈ చిత్రాన్ని సుశీ డైరక్ట్ చేస్తున్నార. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ చిత్రంలో అభినయ మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇక దర్శకుడు సుశీ గణేషన్ గతంలో విక్రమ్ తో మల్లన్న అనే సూపర్ ప్లాప్ చిత్రం ఇచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu