»   » సెన్సార్ ప్రశంసలతో పాటు పూల బొకే అందుకొన్న సూపర్ స్టార్

సెన్సార్ ప్రశంసలతో పాటు పూల బొకే అందుకొన్న సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiyaan Vikram
'శివపుత్రుడు, అపరిచుతుడు, మల్లన్న' ఇలా వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించి, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ హీరోగా రూపొందిన తాజా తమిళ చిత్రం 'దైవ తిరుమగల్'. ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ అధినేత డాక్టర్ మళ్ళ విజయ ప్రసాద్ తో కలిసి సంతోషం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే.

నాన్న అంటే ఎదురుగా కనపడే దైవం. నాన్న జీవన మార్గదర్శి. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు నిద్ర పొయేటప్పుడు కథలు చెప్పించుకొంటారు. ఆ కథలలో హీరోగా వారి నాన్నను ఊహించుకొంటారు. కానీ ప్రస్తుతం విక్రమ్ ప్రధాన పాత్రలో నాన్నగా నటిస్తున్న'నాన్న" చిత్రంలో నాన్న మాత్రం అందుకు వ్యతిరేకం. తన బిడ్డను నిద్ర పుచ్చడానికి కథ చెబుతూ బిడ్డ కంటే ముందు తానే నిద్రపోయే పసి పిల్లవాడిలాంటి మనసు కలిగిన నాన్న పాత్రలో మానసికంగా ఎదుగుదల లేని వ్యక్తిగా విక్రమ్ నటిస్తున్నారు.

విక్రమ్ ప్రస్తుతం చాలా హ్యాపీ మూడ్ లో వున్నాడు. ఎందుకనుకుంటున్నారా... తాజాగా సెన్సార్ వాళ్ల నుంచి ప్రశంసలతో బాటు ఓ ఫ్లార్ బోకే కూడా అందుకున్నాడు. తాజాగా తను నటించిన 'దైవ తిరుమగల్' (తెలుగులో 'నాన్న') సెన్సార్ సమయంలో ఆ సినిమాలోని విక్రమ్ నటనకు ఎంతగానో స్పందించిన సెన్సార్ సభ్యులు, సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా, విక్రమ్ కి పూల బోకే పంపించి తమ అభినందనలు తెలియజేశారట.

ఈ విషయాన్ని విక్రమ్ చెబుతూ, దీనిని పెద్ద కాంప్లిమెంట్ గా భావిస్తున్నాననీ, రేపు రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందుతానన్న నమ్మకం ఉందనీ అంటున్నాడు. కొంత మంది దీనిని ఆర్ట్ ఫిలిం అనుకుంటున్నారనీ, కానీ ఇది పక్కా కమర్షియల్ చిత్రమనీ విక్రమ్ క్లారిఫై చేస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 15 న రిలీజ్ అవుతోంది.

English summary
Chiyaan Vikram is all set for the release of one of the most-anticipated movies of his career, Deiva Thirumagal. The actor, who is doing the role of an adult with the maturity of a five-year-old boy, has impressed the members of the Regional Censor Board with his wonderful performance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu