»   » ఇటలీ యూనివర్సిటీ నుండి అపరిచితుడికి డాక్టరేట్...!

ఇటలీ యూనివర్సిటీ నుండి అపరిచితుడికి డాక్టరేట్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫెర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కు ఒక అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇటలీలోని ఓ విశ్వవిద్యాలయం విక్రమ్ కు డాక్టరేట్ ప్రదానం చెయ్యబోతోంది. మే 29న ఇటలీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ డాక్టరేట్ ను ఇవ్వబోతున్నారు. తమిళహీరోలకు సంబంధించి ఇదివరకే జాతీయ నటుడు కమల్ హాసన్ కు, తమిళ స్టార్ హీరో విజయ్ కు డాక్టరేట్స్ లభించాయి. కమల్ హాసన్ తరహాలో తను చేసే ప్రతి పాత్రలోనూ వెరైటీ కోసం వెతికే విక్రమ్ కళారంగంలో అతని సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ ను ప్రదానం చేస్తున్నట్టు ఆ యూనివర్సిటీవారు పేర్కొంటున్నారు. అయితే విక్రమ్ మాత్రం తాను చేసే విభిన్న పాత్రలు పురస్కారాల కోసం కాదని, ఆయా పాత్రల ద్వారా తాను చేసే విభిన్నపాత్రలు పురస్కారాల కోసం కాదని, ఆయా పాత్రల ద్వారా తను శాటిస్ ఫై అవ్వడమే కాకుండా ప్రేక్షకుల్ని కూడా సంతోషపెట్టాలన్నదే తన ఉద్దేశమని చెప్తున్నాడు.

English summary
Vikram was present at the SRM university annual cultural celebrations where he revealed the good news. He also gave a brief speech and also interacted with the students there. The students conveyed their best wishes to Vikram.
Please Wait while comments are loading...