»   » షాకిస్తున్న విక్రమ్ లుక్ (ఫోటో)

షాకిస్తున్న విక్రమ్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :శివపుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాల్లో విక్రమ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంది. తాజాగా విక్రమ్‌ ప్రముఖ దర్శకులు శంకర్‌ దర్శకత్వంలో 'ఐ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదిగా కొనసాగుతోంది. కొన్ని సన్నివేశాల్లో విక్రమ్‌ గుండుతో కనిపించేందుకు సైతం వెనుకాడలేదు. ఆ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలబడతాయని చెప్తున్నారు. ఈ గెటప్ లో వంద సంవత్సరాల సినిమా వేడకకు హాజరు కావటంతో అందరి దృష్టిలో పడ్డారు.

అలాగే పాత్రకు తగ్గట్లు 15 కిలోలు బరువు తగ్గడానికి కూడా సంశయించలేదు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కనిపించే తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమని దర్శక,నిర్మాతలు చెబుతున్నాయి. విక్రమ్‌... పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఎప్పుడూ ముందుంటారని మరోసారి ప్రూవ్ అవుతుందని అంటున్నారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సంతానం, సురేష్‌ గోపి, ఉపేన్‌ పటేల్‌, రామ్‌కుమార్‌ గణేశన్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్రంకోసం విక్రమ్...శరీరంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం.

ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబోను 9 భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్ ను 15 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాను మించి తన ఐను 17 భాషల్లో విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఆస్కార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

English summary
Vikram is pulling all the stops for his role in the movie Ai. He’s lost oodles of weight and has now shaven his head. Actor Vikram is giving his role in upcoming Tamil romantic-thriller "Ai" everything he can. After losing nearly 15 kg for the movie, he has now shaved his head to shoot a crucial portion of the film. The film has been on floors for over a year now. Vikram gave his first public appearance with a clean shaven head Saturday here at the centenary fete of Indian cinema. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu