»   » విక్రమ్ తో ఇలియానా 'నో' ఎందుకంటే...

విక్రమ్ తో ఇలియానా 'నో' ఎందుకంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా, విక్రమ్ కాంబినేషన్లో ఆ మధ్య '24' అనే చిత్రం ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చాయి. 13బి చిత్రం రూపొందించిన దర్శకుడు విక్రమ్ దీనిని డైరక్ట్ చేస్తారని, మోహన్ నటరాజ్ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. అయితే స్క్రిప్టు సరిగా లేదంటూ విక్రమ్ ఆ చిత్రాన్ని రిజక్ట్ చేసారు. దాంతో అంతా ఆ చిత్రం ఆగిపోయిందనుకున్నారు. కానీ ఆ నిర్మాత మోహన్ నటరాజ్ మాత్రం విక్రమ్ డేట్స్ తన వద్ద ఉండటంతో చిత్రాన్ని కంటిన్యూ చేయదలిచాడు. తాజాగా అతను భూపతి పాండియన్ అనే దర్శకుడు చెప్పిన కథ విని, విక్రమ్ చేత ఓకే చేయించాడు. ఆ డేట్స్ వృధా కాకుండా వేరే కథతో సినిమాను సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.ఈ క్రమంలో ఇలియానా పొజీషన్ ఏమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు.

ఇలియానా ఈ తాజా చిత్రంలో చేయనుందా లేదా అన్నది నిర్మాతతో పాటు హీరోకి డైలమా వచ్చింది. అయితే ఇలియానా మాత్రం ఏ విషయం కన్ఫర్మ్ చేయకుండా కథ విని పాత్రను బట్టి చెపుతానందిట. ఎందుకంటే కొత్త స్క్రిప్టు ప్రకారం విక్రమ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. హీరోయిన్ ది కేవలం నామ మాత్రమైన పాత్ర మాత్రమే. ఇక '24' సినిమా కాన్సిల్ అయినా ఇలియానా అందులో తన పాత్ర గురించి ఇప్పటికీ మీడియాకి గొప్పగా చెప్తోంది. వీటికి తోడు మొదట అనుకున్నట్లు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ మారిపోయారు. ఇవన్నీ చూస్తూంటే ఇలియానా ఈ సినిమా చేసేటట్లు కనపడటం లేదనేది తమిళ మీడియా వాదన.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X