»   » కథ నచ్చి ఉచితంగా చేయటానికి కమిట్ అయిన స్టార్ హీరో

కథ నచ్చి ఉచితంగా చేయటానికి కమిట్ అయిన స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవును..నేను ఆ చిత్రాన్ని ఉచితంగానే చేస్తున్నాను. మళయాళంలో నా సినిమా గురించి ఎదురుచూస్తున్న కేరళ ప్రేక్షకులు కోసం విభిన్నంగా ఉంటే ఈ చిత్రం చేస్తున్నాను అన్నారు జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్. మళయాళంలో నోట్ బుక్, ఎవడమ్ స్వాగమ్ వంటి సూపర్ హిట్స్ రూపొందించిన రోషన్‌ ఆండ్రూస్‌ ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. ఇక క్యాజువల్ గా విక్రమ్ ని కలిసిన ఆండ్రూస్.. తన దగ్గరున్న కథ వినిపించారు. విక్రమ్‌కి ఆ కథాంశం ఎంతగానో నచ్చింది. దాంతో విక్రమ్‌ తాను ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారు. అంతేకాదు కథ నచ్చింది కాబట్టి ఉచితంగా నటిస్తాను అన్నారని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా వచ్చే యేడాది సెట్స్‌ మీదు వెళ్తుందని తెలిసింది. ఇటీవలే విక్రమ్...మణిరత్నం...రావణ్ ‌లో నటించారు. సినిమా ప్లాఫ్ అయినా ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రోషన్ ఆండ్రూస్..కాసనోవ అనే టైటిల్ తో బిగ్ బడ్జెట్ రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ చేస్తున్నారు. మోహన్ లాల్, పృధ్వీరాజ్ ఈ చిత్రంలో చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu