»   » విక్రమ్ ఓ శాడిస్ట్‌: సమంత

విక్రమ్ ఓ శాడిస్ట్‌: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ''తొలిసారిగా విక్రంతో నటిస్తున్నా. నిజానికి ఈ కార్యక్రమం కోసం పలురకాలుగా మేకప్‌ వేసుకుని వచ్చా. కానీ ఇక్కడొచ్చి చూస్తే.. విక్రం మీసమే ఈ కార్యక్రమానికి హైలెట్‌గా మారింది. ప్రతి అంశంలోనూ వైవిధ్యాన్ని కనబరిచే నటుడాయన. బయట ఇలా కనిపిస్తారేగానీ.. నటనలో ఓ శాడిస్ట్‌, ఉగ్రవాది కూడా! సెట్‌లో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇక దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ కూడా షూటింగ్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు''అని సమంత తెలిపారు.

'గోలీసోడా'తో మేకింగ్ పరంగానూ, కలెక్షన్స్ పరంగానూ తమిళ చిత్ర పరిశ్రమను షాక్ ఇచ్చిన దర్శకుడు విజయ్‌మిల్టన్‌. ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఆయన 'పత్తు ఎండ్రదుకుల్ల' తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలోని అశోక్‌పిల్లర్‌ సమీపంలో జరిగింది. కార్యక్రమంలో విక్రం, సమంత, విజయ్‌మిల్టన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పై విధంగా స్పందించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

“Vikram is a sadist,” says Samantha

అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. ''విజయ్‌మిల్టన్‌ కథ చెబుతుంటే నిజంగా ఆశ్చర్యమేసింది. ఆయన తెరకెక్కిస్తున్నప్పుడు.. ఇలా కూడా చిత్రీకరించవచ్చా అనుకున్నా. నిజానికి చాలా వైవిధ్యమైన దర్శకుడాయన. నా కెరీర్‌లోనే భిన్నమైన చిత్రంగా ఇది ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ హంగులకు ఏమాత్రం కొదవుండదు. చిత్ర టీజర్‌ చూస్తేనే సినిమా టేకింగ్‌ గురించి అర్థమవుతుంది. ఇందులో పశుపతి, రాహుల్‌దేవ్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించారు. పలు ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. నా కొత్త ఆహార్యం గురించి అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది తర్వాతి చిత్రానికి సంబంధించింది''అని తెలిపారు.

దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ.. '' 'ఐ'లో భారీగా అలసిపోయిన విక్రం ఇందులో అందంగా తయారయ్యారు. యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఇలా ఉండాలి, అలా కనిపించాలని ముందుగానే షరతులేవీ పెట్టలేదు. ఎలా ఉన్నా షూటింగ్‌కు వెళ్దామని చెప్పా. అయినా.. రోజూ జిమ్‌కు వెళ్లి.. చాలా ఫిట్‌గా షూటింగ్‌కు వచ్చేవారు. సన్నివేశాలకు ముందుగానే హోంవర్కు కూడా చేస్తారాయన.

అందువల్లే చిత్రీకరణలో ఎలాంటి జాప్యం జరుగలేదు. ఇందులో ఓ పాట మాత్రం తొమ్మిది నిమిషాల పాటు వస్తుంది. అందుకోసం బడ్జెట్‌ కూడా ఎక్కువైంది. సమంత నేపాల్‌ అమ్మాయిగా నటించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ దేశంలో కొనసాగే కొన్ని సన్నివేశాల్లో సమంత కూడా ఉన్నారు. అందువల్లే ఈ ప్రచారం సాగుతోందని భావిస్తున్నాన''ని తెలిపారు.

English summary
Speaking at the teaser launch of 10 Endrathukulla, Samantha Ruth Prabhu said, “I feel very fortunate that Vijay Milton offered me this role. No body in the industry would have considered me for a role like this.” “Vijay Milton used to beat and scold me a lot. Vikram is a sadist,” said Samantha playfully and Vikram duly nodded at Samantha’s caper. While the posters of the film showcase Samantha in two different looks, Vijay Milton clarified that she is not playing a dual role in the film.
Please Wait while comments are loading...