»   » నయనతార ఓకే అంది..యూనిట్ ఖుషీ

నయనతార ఓకే అంది..యూనిట్ ఖుషీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నయనతార తన నటించే పాత్రల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. దాంతో ఆమెకు కథ చెప్పిన తర్వాత ఆమె ఒప్పుకుంటుందా లేదా టెన్షన్ లో దర్శక,నిర్మాతలు ఉంటున్నారు. అయితే ఆమె మాత్రం తన పాత్ర, సినిమా కథ నచ్చితే మిగతా విషయాలేమీ పట్టించుకోకుండా ఓకే చేస్తానంటోంది. తాజాగా ఆమె ఓ చిత్రం ఓకే చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'ఐ' తర్వాత విక్రమ్‌ 'పత్తు ఎన్రదుకుళ్లే'లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఇందులో ఆయనకు జంటగా సమంత ఆడిపాడుతోంది. ఈ నేపథ్యంలో 'అరిమా నంబి' ఫేం ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఇందులో హీరోయిన్ గా చేసేందుకు నయనతారను సంప్రదించారట. ఆమె ఒప్పుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉందట. ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించాల్సి ఉంది.

కాలానికి తగ్గట్టు తమను తాము మలచుకోకపోతే.. రాణించడం సాధ్యం కాదని నయనతార కి తెలిసినట్లు మరొకరకి తెలియదేమో. అందుకే అగ్రహీరోలతో ఆడిపాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. కుర్ర హీరోలతోనూ జతకడుతోంది నయన్‌. బాలకృష్ణ-ఎన్టీఆర్‌, వెంకటేష్‌- రాణా.. వంటి బాబాయ్‌- అబ్బాయిలతో జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ. రజనీకాంత్‌, ధనుష్‌ల సరసన కూడా ఆడిపాడింది. నయన్‌కి పోటీగా ఎందరొచ్చినా.. ఇప్పటికీ ఆమె క్రేజీ మాత్రం కోలీవుడ్‌లో తగ్గలేదనే చెప్పాలి.

ఇటీవల నటుడు జై సరసన ఆడిపాడి అందర్నీ ఆకట్టుకుంది. త్వరలో విజయాల వీరుడు విజయసేతుపతితో కూడా కలిసి నటించనుంది. ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నానుం రౌడీ దాన్‌' (నేనూ రౌడీనే) అని టైటిల్‌ పెట్టారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో 'సూదుకవ్వుం' స్టెల్‌లో ఇక్కడ ఎవర్ని కిడ్నాప్‌ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. అందుకు 'నయనతార' అని సమాధానమిచ్చారు విజయ్‌ సేతుపతి.

Vikram and Nayantara join hands for the first time!

'నయన్‌ అంటే ఎంత ఇష్టమని' ప్రశ్నించగా.. తెగ సిగ్గుపడిపోయి సమాధానం కూడా చెప్పకుండా దాటవేశారు విజయ్‌. ఈ కార్యక్రమానికి అదో పెద్ద హైలెట్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్‌ సేతుపతి కల నెరవేరింది. ఈ విషయాన్ని ధనుష్‌ తన ట్విట్టర్‌లో ప్రస్తావించగా.. అందుకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. వారిలో ఓ వ్యక్తి.. 'కొక్కి కుమార్‌' నిర్మించగా 'సుమారు మూంజి కుమారు' నటిస్తున్నారని చేసిన పోస్టును.. ధనుష్‌ రీట్వీట్‌ చేయడం విశేషం.

విక్రమ్ చిత్రాల విషయానికి వస్తే....

రీసెంట్ గా విక్రమ్‌, ఎమీజాక్సన్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐ'. తమిళంలో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాను మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నెగిటివ్ టాక్ మూట గట్టుుకన్నా...కలెక్షన్స్ పరంగా కొంచెం కూడా వెనకపడలేదు. తొలివారం కలెక్షన్స్ లో రికార్డుని క్రియేట్ చేసింది. డబ్బింగ్ చిత్రాల్లో రోబో చిత్రమే...రెవిన్యూ పరంగా టాప్ ప్లేస్ లో ఉండగా..ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది.

అలాగే... ఓ కథని జడ్జిమెంట్ చేయటం ఎంత కష్టం...అందులో కోట్ల పెట్టుబడి, కెరీర్ ల మీద గేమ్ గా నడిచే సినిమా నిర్మాణంలో కీలకంగా నడిచే కథ అంటే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్.

సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది.

విక్రంతో పరిచయం గురించి చెప్తూ... 'గోలిసోడా' చిత్రాన్ని సత్యం థియేటర్‌లో చూసి.. వెంటనే నాకు ఫోన్‌ చేశారు విక్రం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరి నాకు ఏదైనా మంచి కథ ఉందా?.. అని ఆ రోజు అడిగారు. నేనస్సలు నమ్మలేకపోయా. తప్పకుండా చెబుతా సార్‌ అన్నా. అలా మా ఇద్దరి సినిమాకు ఆ మాటలే బీజం అని ఆనందంతో వివరించారు.

విజయ్ మిల్టన్ మాట్లాడుతూ... దర్శకుడు కావాలన్నది నా ఆశ. కానీ చలనచిత్ర కళాశాలలో దర్శకత్వం కోర్సు చదవాలంటే డిగ్రీ తప్పనిసరి. కానీ అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మూడేళ్లు చదివే అవకాశం కూడా లేదు. అందువల్ల ప్లస్‌టూ అర్హతతో ఛాయాగ్రాహకుడిగా చేరా. 1991లో కోర్సు పూర్తయ్యాక శక్తి శరవణన్‌, విన్సెంట్‌ సెల్వా వద్ద చేరా. అలా దాదాపు తొమ్మిది మంది వద్ద సహాయకుడిగా పని నేర్చుకున్నా. ఇప్పటి వరకు 25 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. అన్ని సినిమాల్లోనూ దర్శకుడిగా నా ఆలోచన, పరిశీలనా దృష్టి మాత్రం ఉండేది అన్నారు.

అలాగే...ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నప్పుడు 'కాదల్‌', 'దీపావళి', 'దయా', 'వనయుద్ధం', 'హలో'.. వంటి చిత్రాలు నాకు చాలా పాఠాలు నేర్పాయి. ఎన్నో విషయాలను తెలుసుకున్నా. ఈ సమయంలోనూ ఓవైపు కథలు కూడా రాసుకునేవాడిని. ఏదోఒక రోజు మెగాఫోన్‌ పట్టాలనే తహతహలాడా. నాటి అనుభవం, నా ఆశలతో 'గోలిసోడా'కు దర్శకుడినయ్యా అన్నారు.

ఇక 'గోలిసోడా' అనుభవం గురించి చెప్తూ... ఖర్చు పెట్టిన సొమ్ము కన్నా 14 రెట్లు లాభం తెచ్చిపెట్టిందీ చిత్రం. తొలిరోజు 140 థియేటర్లలో విడుదలై.. కొన్ని రోజుల తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా మరో 60 థియేటర్లలో కూడా విడుదలైంది. అందులో తారలెవరూ లేదు. 5డీ కెమెరాతో తెరకెక్కించామంతే. మొత్తం ఓ 20 మందితో కథ నడిపాం. అతిపెద్ద అనుభవాన్ని మిగిల్చిన చిత్రం. నా కెరీర్‌ను వూహించని మలుపు తిప్పింది అన్నారు.

తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ... 'గోలిసోడా' తర్వాత అంతకు మించిన చిత్రం తీయాలన్నది నా కోరిక. అలా '10 ఎండ్రత్తుకుల్ల' అనే కథను సిద్ధం చేసుకున్నా. తొలిసారి ఆ కథ వన్‌లైన్‌ను విక్రంకు ఫోనలో చెప్పా. వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. కథ చెప్పిన వెంటనే.. పదే పది క్షణాల్లో నటిస్తానని ఒప్పుకొని నాలో ఆనందాన్ని నింపారు. అదే వేగంతో చిత్రీకరణ కూడా 90 శాతం పూర్తి చేశాం. క్లెమాక్స్‌, రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమంత హీరోయిన్ అని చెప్పుకొచ్చారు.

English summary
Vikram doing a movie with 'Arima Nambi' Fame Anand Shankar. and the important thing to be mentioned was that of the Heroine. Yes, and the heroine is none other than 'Nayanthara'. This will be the first time Vikram and Nayanthara doing a film together.
Please Wait while comments are loading...