»   »  విక్రమ్ నెక్ట్స్ ఆ సూపర్ హిట్ డైరక్టర్ తో....

విక్రమ్ నెక్ట్స్ ఆ సూపర్ హిట్ డైరక్టర్ తో....

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: మాస్‌, కమర్షియల్‌ కథలను రూపొందించడంలో తమిళ దర్శకుడు ది ఓ ప్రత్యేక శైలి. ఆయన సినిమా వస్తోందంటే తెలుగు,తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. తాజాగా సూర్యకు 'సింగం', 'సింగం-2' అంటూ వరుస హిట్స్ అందించాడు. గతంలో విక్రమ్‌తో తెరకెక్కించిన 'సామి' చక్కటి వసూళ్లు సాధించింది. ఇదే చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా 'లక్ష్మీనరసింహ'గా రీమేక్‌ అయ్యింది. తెలుగు హీరోల కన్ను హరిపై పడిందని ఇటీవల చర్చ మొదలైంది. తాను తెలుగు సినిమాలపై ఇంకా దృష్టి పెట్టలేదని చెబుతున్నాడు హరి. అయితే ఆయన తదుపరి చిత్రం విక్రమ్ తో ఖరారు చేసారని తెలుస్తోంది.

ప్రస్తుతం విక్రమ్‌తో మరో మాస్‌ కమర్షియల్‌ను తెరకెక్కించే పనుల్లో నిమగ్నమయ్యాడట. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో 'ఐ' (మనోహరుడు) చిత్రీకరణలో తీరికలేకుండా ఉన్న విక్రమ్‌ అది పూర్తవగానే హరి సినిమాలో నటించనున్నాడు. పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విక్రమ్‌కు 'ఐ', హరి చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రూపొందుతున్న 'ఐ' విషయానికి వస్తే....విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం కాలీపాక్ దగ్గరలోని ఓ హాస్పటిల్ లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ముప్పై రోజులు పాటు షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంకోసం విక్రమ్...శరీరంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు.

ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

English summary

 Vikram appears to be having some fantastic luck. The hero, who is working with expert executive like Shankar and Manirathnam, has marked two films with built chiefs as of late in a fast progression. Notwithstanding, he has got a movie chnace, which will be steered by none other than Hari (Singam fame), who is lounging in the triumph of Singam 2. The 47 Year old Hero had as of late offered nod to Dharani’s untitled undertaking and Gautham Menon’s proposed bilingual.now, he has given green indicator to Hari’s flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu