»   » విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం ఉంగరం మిస్సైంది, పోలీస్ కేసు

విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం ఉంగరం మిస్సైంది, పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు విక్రమ్‌ కుమార్తె అక్షితకు... డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్దంలో భాగంగా..రంజిత్ తన కాబోయే భార్యకు ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగారు. అయితే ఇప్పుడా రింగ్ మిస్సైంది.

నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్‌లు మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఖాదర్‌ నవాజ్‌ ఖాన్‌ రోడ్డులోని ఓ ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లానని తిరిగి వెళుతుండగా చూసుకునే సరికి చేతికి ఉంగరం లేదని.. దాని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అక్షిత ఫిర్యాదులో పేర్కొంది.

హీరో విక్రమ్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)

పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఐస్‌క్రీం పార్లర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశించారు. అక్షిత, రంజిత్‌ల వివాహం 2017లో జరగనుంది. ఈ విషయమై విక్రమ్ కూడా ఉన్నతాధికారులకు ఈ విషయమై ధర్యాప్తు ముమ్మరం చేయమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Vikram’s daughter engagement ring missed

జూలై 10న ఆమె నిశ్చితార్దం జరిగింది. చెన్నైలోని కేర్ బేకరీ రంగనాధన్ కుమారుడు మను రంగనాధన్‌తో ఆమెకు వివాహం నిశ్చియమైంది. అక్షిత, మను గత కొద్ది కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు తమ పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారు. వచ్చే సంవత్సరం వివాహం జరగనున్నట్లు సమాచారం.

నిశ్చితార్ధ వేడుకకు బంధువులు, అత్యంత ఆప్తమిత్రులు మాత్రమే హాజరు అయ్యారు . ప్రముఖ దర్సకుడు శంకర్ ...ఈ వేడకకు వ చ్చి వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం వివాహ పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్ 'ఇరుముగన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

English summary
Tamil actor Vikram's daughter Akshita is all set to get marriage to Manu Ranjith, the great grandson of DMK chief Karunanidhi. Now Engagement ring is missed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu