For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విక్రమ్ కొత్త చిత్రం 'డేవిడ్‌' కాన్సెప్టు..రిలీజ్ డేట్

  By Srikanya
  |

  చెన్నై : సూపర్‌ మల్టీస్టారర్‌గా ప్రేక్షకుల్లో ప్రత్యేకముద్ర సంతరించుకున్న 'డేవిడ్‌' ఫిబ్రవరి ఒకటిన ప్రేక్షకుల చెంతకు రానుంది. వరుస పరాజయాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న కథానాయకులు విక్రమ్‌, జీవా. ప్రస్తుతం భారీ విజయం కోసం వేచి చూస్తున్న వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం 'డేవిడ్‌'. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పిజాయ్‌ నంబియార్‌ తెరకెక్కించాడు. ఇటు ప్రేక్షకులు, అటూ వ్యాపార వర్గాల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇందులో విక్రమ్‌, జీవా పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటన్న విషయాన్ని ఆసక్తిగా చూపించామని, తెరపై అది ప్రేక్షకులను ఉత్కంఠ కలిగిస్తుందని అంటున్నాడు దర్శకుడు.

  గోవా తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు డేవిడ్‌. అతనికీ ముంబయిలో ఉండే గిటార్‌ వాద్యకారుడు డేవిడ్‌కీ సంబంధం ఏమిటి అన్నది తెర మీదే చూడాలంటున్నారు బిజోయ్‌ నంబియార్‌. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డేవిడ్‌'. విక్రమ్‌, జీవా ప్రధాన పాత్రల్లో నటించారు. లారా దత్తా, టబు, ఇషా శర్వాణీ ముఖ్య పాత్రధారులు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న డేవిడ్‌ ఫిబ్రవరి ఒకటిన థియేటర్లలో సందడి చేయనుంది.

  బిజోయ్‌ మాట్లాడుతూ ''ఇద్దరి పేర్లూ ఒక్కటే... కానీ జీవితాలు, వాళ్ల పయనం మాత్రం వేర్వేరు. ఆద్యంతం వినోదాన్నీ, ఉత్కంఠనీ రేకెత్తించేలా సాగుతుందీ చిత్రం. ఈ కథలోని ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది''అన్నారు. ఈ సినిమాకి ఆరుగురు సంగీత దర్శకులు బాణీలు అందించారు. నాజర్‌, సారిక, రోహిణి హట్టంగడి, రెమో ఫెర్నాండెజ్‌, రూబీ చక్రవర్తి, ప్రహ్లాద్‌ కక్కర్‌ తదితరులు నటించారు

  హిందీ చిత్రం 'సైతాన్' ద్వారా దర్శకునిగా పరిచయమైన బిజోయ్‌కి ఆ సినిమా ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. డేవిడ్ పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే 'గ్యాంగ్‌స్టర్-కామెడీ' మూవీ ఇది. ఈ రెండు పాత్రలను విక్రమ్, జీవా చేస్తున్నారు.

  లారాదత్తా, టబు, ఇషా శర్వాణి, నాజర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ఆరుగురు సంగీతదర్శకులు పనిచేయడం విశేషం. ఇందులో మొత్తం 9 పాటలుంటాయి. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పి.ఎస్‌.వినోద్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌.

  English summary
  Vikram, Jiiva's action entertainer 'David' is all set for release on February 1st. Bejoy Nambiar who made Saitan in Hindi is the director for the film. Lara Dutta, Tabu, Isha Sharwani, Nazar are the stars of the film for which music is scored by six music directors. Film is a trilingual entertainer in Tamil, Hindi and Telugu. Modern Mafia, Bram Fatura, Prashat Pillai, Remo Fernandez, Anirudh Ravichandrer, Matibany are the music directors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X