»   » హాలీవుడ్‌ స్థాయిలో ఉంది 'టీజర్' అని మెచ్చుకుంటున్నారు

హాలీవుడ్‌ స్థాయిలో ఉంది 'టీజర్' అని మెచ్చుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై‌: విక్రమ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకుడు. స్పై థ్రిల్లర్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హేరిస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. టీజర్‌ను చూసిన అభిమానులు హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సంబరపడతున్నారు.

Vikram's Dhruva Natchathiram teaser

గత కొంతకాలంగా గౌతం మేనన్‌ 'ధ్రువ నక్షత్రం' రూపొందించటానికి ప్రయత్నిస్తున్నారు. మొదట హీరో సూర్యతో తెరకెక్కించాలని భావించారు. అయితే సూర్యతో విభేధాలు వచ్చాయి. ఆ తర్వాత పలువురు హీరోలను దాటుకుని విక్రం చేతికొచ్చింది.

సినిమాలోని పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అతికొద్ది మంది నటుల్లో విక్రమ్‌ ఒకరు. ఆయన సినిమాల జాబితాను చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. నిజానికి 'ఇరుముగన్‌' సినిమా తర్వాత విజయ్‌చందర్‌ దర్శకత్వంలోని ఓ సినిమా, ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో విక్రం నటిస్తారని వార్తలొచ్చాయి.

అయితే 'సామి 2' కన్నా ముందుగానే 'ధ్రువ నక్షత్రం' చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు విక్రం. ఈ సినిమా కమల్‌ నటించిన 'వేట్టైయాడు విళయాడు' తరహాలో ఉంటుందని సమాచారం. చిత్రీకరణ పూర్తిగా విదేశాల్లోనే జరగనుంది.

Vikram's Dhruva Natchathiram teaser

ఇందులో విక్రం.. జాన్‌ అనే గూఢచారి పాత్రలో నటించనున్నారు. రానున్న ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా విజయ్‌చందర్‌ దర్శకత్వంలోని చిత్రం విడుదల కానుంది.

English summary
Gautham Menon's upcoming film is Dhruva Natchathiram, which has Chiyaan Vikram in the lead.After teasing the audience with stylish pictures of Vikram from the film, Gautham Menon has released a kickass teaser of Dhruva Natchathiram, which is breaking the internet for all the right reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu