»   »  విలన్...హీరో....విక్రమే

విలన్...హీరో....విక్రమే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vikram
మరో 'అపరిచితుడు' లాంటి స్ల్పిల్ట్ పర్శనాలటీ కథేమీ విక్రమ్ చెయ్యబోవటం లేదు. మరి విలన్ గా,హీరోగా విక్రమ్ ఎలా కనపడతాడంటే అదే మణిరత్నం సినిమా కథలో ట్విస్టు. సౌత్ లో నటుడు అన్న పదానికి అర్ధం చెబుతూ ఎదిగిన హీరో విక్రమ్. అతను సినిమా అంటే ఈ రోజు సౌత్ మొత్తం ఎదురు చూసే స్థితికి వచ్చింది. ఇప్పుడు అతను విలన్ గా నటించటానికి ముచ్చుటపడుతున్నాడు. అదీ ఆయన హీరోగా చేస్తున్న కథలో...ప్రస్తుతం అతను కందసామి (తెలుగులో మల్లన్న) పూర్తి చేసిన అతను ఇప్పుడు మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేస్తున్న ఆ సినిమాలో మళయాళ హీరో పృధ్వీరాజ్ విలన్ గా చేస్తున్నాడు.

అదే హిందీ వెర్షన్ కొచ్చేసరికి ఐశ్వర్య ప్రక్కన అభిషేక్ బచ్చన్ ..హీరోగా అంటే విక్రమ్ పాత్రలో కనపడతాడు. అలాగే విలన్ గా తిరిగి పృద్వీరాజ్ నే తీసుకుందామని మణిరత్నం అభిప్రాయం. కానీ విక్రమ్ ఆ విలన్ పాత్ర తనకి కావాలని పట్టుపడుతున్నాడట. ఎందుకంటే ఆ పాత్ర చాలా టెర్రిఫిక్ గా,మైండ్ బ్లోయింగ్ చేసే విధంగా ఉంటుందిట. దానికి విక్రమ్ ఫేసనేట్ అయ్యపోయాడట. అందుకే తమిళంలో హీరోగా, హిందీలో విలన్ గా చేయటానికి ఉత్సాహపడుతున్నాడట. అందుకోసం తన రెమ్యునేషన్ సైతం త్యాగం చెయ్యటానికి సిధ్ధపడ్డాడుట. అంటే ఒకే సినిమాలో హీరోగా,విలన్ గా ఆయనే కనపడతాడన్నమాట. అందుకే విక్రమ్ దిగ్రేట్ అంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X