»   » ధనుష్ ‘విఐపి-2’ అఫీషియల్ టీజర్

ధనుష్ ‘విఐపి-2’ అఫీషియల్ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో ధ‌నుష్ నటించిన విఐపి చిత్రం తమిళంలో భారీ హిట్. తెలుగు 'రఘువరన్ బి టెక్' పేరుతో రిలీజైన ఈ చిత్రం ఇక్కడ కూడా సూపర్ హిట్ హిట్ అయింది. ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నోడి క‌ష్టాలు..ఎలా ఉంటాయ‌న్న పాయింట్ కు త‌ల్లి సెంటిమెంట్ ను జోడించి తెర‌కెక్కించిన సినిమా తెలుగు ఆడియ‌న్స్ హృద‌యాల‌ను తాకింది.

తాజాగా విఐపి చిత్రానికి సీక్వెల్ గా 'విఐపి-2' తెరకెక్కుతోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం అఫీషియల్ టీజర్ బుధవారం రిలీజ్ చేశారు. వి.క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెస్పాన్స్ అదుర్స్

తెలుగు, తమిళంలో విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

విలన్ పాత్రలో కాజోల్

విలన్ పాత్రలో కాజోల్

ధనుష్ కు పోటీగా ప్రతినాయిక పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తోందని చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కూతురు సౌందర్య తెలిపారు.

కాజోల్ పాత్ర

కాజోల్ పాత్ర

ధనుష్‌ను ఢీకొట్టే వ్యాపారవేత్త పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. అంతమాత్రన పూర్తిగా విలన్ గా భావించకూడదు. కాజోల్ తన నటనతో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తారు అని అన్నారు. ఆమె పాత్రలో విభిన్నమైన కోణాలున్నాయని పేర్కొన్నారు.

త్వరలో రిలీజ్

త్వరలో రిలీజ్

తొలి భాగం విఐపీ చిత్రంలో ఉన్నపాత్రలే.... పార్ట్ 2 లోనూ కంటిన్యూ కానున్నాయి. తొలి భాగం కంటే రెండో భాగం మరింత ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. జులై 28న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Raghuvaran Is Back! Unleashing the Official Telugu Teaser of "VIP 2" starring Dhanush, Kajol, Amala Paul & others in lead ; Directed by Soundarya Rajinikanth. V Creations Kalaippuli S.Thanu | Wunderbar Films Pvt. ltd. Dhanush in & as "Velai Illa Pattadhaari 2" - Releasing on July 28th 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu