Vishal Sai Dhansika Engagement: సైలెంట్‌గా సాయి ధన్సికతో విశాల్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆగస్ట్ 29న తన పుట్టినరోజు నాడు శుభవార్త చెబుతానన్న విశాల్ ఎట్టకేలకు మాట నిలబెట్టుకున్నారు. తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. తన నివాసంలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి ధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు విశాల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Vishal and Sai Dhanshika exchange rings Engagement held on actor s birthday

పలువురు హీరోయిన్లతో విశాల్ ఎఫైర్లు?
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే సల్మాన్ ఖాన్ తర్వాతి ప్లేస్ విశాల్‌దే అన్నంతగా సినీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్.. ఇంకా ఒక ఇంటివాడు కాకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది. అందరు హీరోల మాదిరిగానే పలువురు హీరోయిన్లతో విశాల్‌కు ఎఫైర్స్ ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి. అభినయ, వరలక్ష్మీ, లక్ష్మీమీనన్ తదితరులతో విశాల్ డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.

సాయి ధన్సికతో రిలేషన్
కొద్దిరోజుల క్రితం తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరో బయట పెడతానని షాకిచ్చారు విశాల్. తర్వాత యోగిత మూవీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన విశాల్.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయి ధన్సికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా సాక్షిగా ప్రకటించి షాకిచ్చారు. అయితే దశాబ్థాల కల అయిన నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ శపథం చేశారు. ఇలాంటి దశలో సాయి ధన్సికను పెళ్లాడబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించడంతో సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

కబాలితో సాయి ఫేమస్
తంజావూరుకు చెందిన సాయి ధన్సిక 2009లో పేరణ్మాయితో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అరవణ్, పరదేశి తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలీలో ఆయనకు కూతురిగా నటించి పాపులరైంది సాయి ధన్సిక. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాలతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్నారు సాయి. 8 ఏళ్లుగా విశాల్- సాయి ధన్సిక రిలేషన్‌లో ఉన్నప్పటికీ తమ బంధాన్ని సీక్రెట్‌గా ఉంచి సడెన్‌గా షాకిచ్చారు.

విశాల్‌తో పరిచయం ఎలా?
వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయకుండానే ఎలా దగ్గరయ్యారు? ఎలా ప్రేమలో పడ్డారని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఓ సభలో సాయి ధన్సికపై హీరో శింబు తండ్రి టీ రాజేందర్ విరుచుకుపడటంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సర్దిచెప్పాల్సిన తోటి నటులు కూడా నవ్వుతూ వేడుక చూశారే తప్పించి రాజేందర్‌ను ఎవ్వరూ అడ్డుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న నాటి తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు విశాల్ .. సాయి ధన్సికకు అండగా నిలిచారు. రాజేందర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు.. ఈ ఘటనతో విశాల్- సాయి ధన్సికల మధ్య కేవలం పరిచయంగా ఉన్న స్నేహం.. ప్రేమగా మారిందనే కోలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి.

సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్
సాయి ధన్సికను పెళ్లాడబోతున్నట్లుగా విశాల్ ప్రకటించగా.. అసలు వీరిద్దరి పెళ్లి జరుగుతుందా? అని వార్తలు వచ్చాయి. నడిగర సంఘం భవనం పూర్తి కాకపోవడమే దీనికి కారణం. ఆగస్ట్ 29వ తేదీన విశాల్ పుట్టినరోజు కావడంతో ఆయన పెళ్లిపై ఏదో ఒక అప్‌‌డేట్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు విశాల్. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: vishal sai dhansika
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X