twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం హెచ్చరిక!!?? సిమాలు తీయం, సమ్మెకు దిగుతాం: విశాల్

    పైరసీ, టిక్కెట్ రేట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మే 30 నుంచి సమ్మెకు దిగుతామని, చిత్రసీమ పనిచేయదని తేల్చిచెప్పేశాడు విశాల్.

    |

    "పైరసీ సీడీలు, ఆన్‌లైన్ పైరసీ వల్ల యేటా తమిళ సినిమాకు 800 నుంచి వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతోంది.సినిమా ద్వారా వచ్చే ఆదాయం లో కేవలం20శాతం మాత్రమే నిర్మాతకు అందుతోంది. ఇదే కొనసాగితే నిర్మాతలు సినిమాలు తీయలేరు. వేరే వృత్తులు చూసుకోవాల్సిందే'...

    పైరసీ పై యుద్దం

    పైరసీ పై యుద్దం

    ఈ మాటలన్నది ఎవరో కాదు విశాల్. అదికూడా 2016 ఏప్రిల్ లో కానీ సంవత్సరం మారినా పరిస్థితి అలాగేఉంది అందుకే తాను రంగం లోకి ది అటు నడిగర్ సంఘం, ఇటు తమిళ నిర్మాతల సంఘం రెండిటినీ అదుపులోకి తెచ్చుకున్నాడు. ఇక పైరసీ పై యుద్దం సీరియస్ గా మొదలు పెట్టనున్నాడు.

    పైరసీ సైట్ల బరితెగింపు

    పైరసీ సైట్ల బరితెగింపు

    తమిళ సినిమాల విషయంలో పైరసీ సైట్ల బరితెగింపు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే.. ముందుగా ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్న తమిళనాడు రైతులకు అండగా నిలవడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని, ఆపై నిర్మాతల మండలిని చక్కదిద్దే పని మీద దృష్టిసారిస్తానని చెబుతూనే..

    తమిళ్ రాకర్స్ వెబ్ సైట్

    తమిళ్ రాకర్స్ వెబ్ సైట్

    పైరసీ మీద పోరాటం గట్టిగా ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా పైరసీ సినిమాలకు పెట్టింది పేరైన తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పేరు పెట్టి మరీ విశాల్ వార్నింగ్ ఇచ్చాడు... అయితే తానొక్కడే ప్రయత్నించటం వల్ల లాభం ఉండదని అర్థమయ్యిందేమో గానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇన్వాల్వ్ చేయటానికి సిద్దమయ్యాడు...

    తమిళ సినిమాను రక్షించడానికి

    తమిళ సినిమాను రక్షించడానికి

    ఆ ఆలోచనతోనే ఇప్పుడు ఈ కుర్ర హీరో దూకుడు పెంచాడు. తమిళ సినిమాను రక్షించడానికి అవసరమైతే స్ట్రైక్ చేయడానికైనా సిద్ధమని తెలిపాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైరసీపై ఉక్కుపాదం మోపాలని విశాల్ కోరుతున్నాడు. ఇల్లీగల్ అడల్ట్ వెబ్ సైట్స్‌ను నివారించిన కేంద్ర ప్రభుత్వం.. పైరసీ వెబ్ సైట్స్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

    పైరసీ, టిక్కెట్ రేట్లపై

    పైరసీ, టిక్కెట్ రేట్లపై

    సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాతలు, పంపిణీదారులు సైతం పారదర్శకతను పాటించాలని విశాల్ కోరాడు. పైరసీ, టిక్కెట్ రేట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించాడు.

    మే 30 నుంచి సమ్మెకు దిగుతామని

    మే 30 నుంచి సమ్మెకు దిగుతామని

    ప్రభుత్వాలు సత్వరం స్పందించకపోతే మే 30 నుంచి సమ్మెకు దిగుతామని, చిత్రసీమ పనిచేయదని తేల్చిచెప్పేశాడు. ఇటు నడిగర్ సంఘం, అటు నిర్మాతల మండలి పగ్గాలు విశాల్ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి.. ఏం జరుగుతుందో చూడాలి. పైరసీ ఒక్క తమిళ పరిశ్రమకే కాదు మొత్తం సినీ పరిశ్రమకే పెద్ద ముప్పు. ఇప్పుడు విశాల్ ప్రయత్నం తో దీని పరిష్కారానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూడాలి.

    English summary
    The newly elected Tamil Nadu Film Producer’s Council President Vishal has announced that the industry will go on an indefinite strike if the State and the Central Governments did not take action against piracy and also raise film ticket prices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X