»   »  ఈ సారి ఖుష్భూ వెనక విశాల్ ఉన్నాడు.... నిర్మాతల మండలి ఎన్నికల్లో ఇలా

ఈ సారి ఖుష్భూ వెనక విశాల్ ఉన్నాడు.... నిర్మాతల మండలి ఎన్నికల్లో ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రాజకీయాలను తలపించేలా సాగిన నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో మరో సంగ్రామానికి తెరలేవబోతోంది. ఈసారి తమిళ సినిమా నిర్మాతల వంతు వచ్చింది. తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎంపికకు వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి రాజకీయాలను తలపించేలా సాగిన నడిగర్‌ సంఘం ఎన్నికల ప్రభావంతో దాదాపుగా అన్ని సినీ సంఘాల్లోను కార్యవర్గంపై అసంతృప్తి సెగలు రేగాయి.

  ఇప్పుడు తమిళ సినిమా నిర్మాతల వంతు వచ్చింది. తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎంపికకు వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. సీనియర్‌ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నేతృత్వంలోని ప్రస్తుతం కార్యవర్గంపై అసంతృప్తితో ఈ ఎన్నికల్లో పలు కూటములు బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి.

  నడిగర్‌ సంఘం ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విశాల్‌ నిర్మాతల మండలి ఎన్నికల్లోను బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తన కూటమి తరపున సీనియర్‌ నటి, నిర్మాత ఖుష్బూ అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరదీశారు. ఈ మేరకు విశాల్‌ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

  2015లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అధ్యక్షుడు థాను నేతృత్వంలోని కార్యవర్గం కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో నూతన కార్యవర్గం ఎంపికకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మక భావించాలని విశాల్ ప్రకటించారు. 2015లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అధ్యక్షుడు థాను నేతృత్వంలోని కార్యవర్గం కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో నూతన కార్యవర్గం ఎంపికకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

  Vishal announces Khushbu's name for Producers Council polls


  ఈ ఎన్నికల్లో బరిలో దిగేందుకు విశాల్‌ కూటమి రంగం సిద్ధం చేస్తోంది. కూటమి సభ్యులతో చర్చించిన తరువాత నటి ఖుష్బూ సుందర్‌ను తమ కూటమి అధ్యక్ష పదవి అభ్యర్థిగా నిర్ణయించామని విశాల్‌ ప్రకటనలో తెలిపారు. ఇతర పదవులకు పోటీచేయనున్న అభ్యర్థ్థుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, నిర్మాతల మండలి ఎన్నికలను విశాల్‌ వర్గం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాతల మండలి నుంచి విశాల్‌ను తాత్కాలికంగా తొలగించిన విషయం తెలిసిందే.

  దాంతో ఈ ఎన్నికలను మరింత సీరియస్ గా తీసుకున్న విశాల్ ఇక్కద కూడా చాలా సీరియస్ గా పని చేస్తున్నాడు. ఈ మేరకు విశాల్‌ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇతర పదవులకు పోటీచేయనున్న అభ్యర్థుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

  English summary
  Looks like the sensational drama between Nadigar Sangam and Tamil Film Producers Council seem to start even as the year began.Actor and Nadigar Sangam Secretary Vishal surprised all on Sunday by announcing actress/politician and producer Khushbu Sundar as his team’s Presidential candidate for the upcoming TFPC election.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more