Don't Miss!
- Finance
adani fpo: అదానీ FPO హిట్టా, ఫట్టా ? ఓపెనింగ్ డే సేల్ ఇంతేనా.. ??
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
శత్రువులుగా మారిన స్టార్ హీరోలు.. విశాల్-ఆర్య మధ్య పోరు
ఇద్దరు హీరోలను, అది కూడా మంచి నటులను ఒకే సినిమాలో పెట్టాలంటే కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విశాల్ ఆర్య వంటి హీరోలతో వాడు వీడు అనే సినిమాను తీశాడు దర్శకుడు బాలా. అది తెలుగులో అంతగా వర్కవుట్ కాకపోయినా కోలీవుడ్‌లో క్లిక్ అయింది. అలాంటి చిత్రం తరువాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతోన్నారు.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఈ మూవీ షూటింగ్‌ను ఓ పదిహేను రోజుల పాటు ఇక్కడే రామోజీ ఫిలీం సిటీలో షూట్ చేశారు. మొదటి షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను తాజాగా రివీల్ చేశారు. ఎనిమీ అంటూ ఇద్దరి ఫోటోలను ఆ టైటిల్ లోగోలో పెట్టేశారు. అందులో ఈ ఇద్దరు శత్రువుల్లా మారి పోట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు వారి కంటి చూపు చెబుతోంది.

నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరి మధ్య జరిగే పోరాటం చాలా బాగుండబోతోందని విశాల్ తెలిపాడు. ఈ సినిమాలో ఆర్య విలన్‌గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్‌గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ ఫిక్స్ చేయాల్సి ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తెలిపాడు.
