For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ధియోటర్స్ లోకి రానివ్వకుండా చాలా మంది కుట్ర : విశాల్‌

  By Srikanya
  |

  చెన్నై : నా సినిమా థియేటర్లలోకి రానివ్వకుండా తెరవెనుక చాలామంది కుట్రపన్నారు. వాళ్లెవరో నాకు తెలియదు. వారిని కనిపెట్టి పగ, ప్రతీకారాలు తీర్చుకోవడం నా పనికాదు. ఎందుకంటే నటుడిగా నా సినిమా విడుదల కావాలి, విజయం సాధించాలన్నదే నా తాపత్రయం. అందుకోసమే శ్రమించా అంటూ మీడియా వద్ద ఆవేదనగా అన్నారు యంగ్ హీరో విశాల్. తెలుగులో 'వేటాడు వెంటాడు'గా 25న తెరపైకి రానుంది. కేరళ, కర్ణాటకల్లోనూ విడుదల కానుంది.

  అలాగే నా కెరీర్‌లో 'పందెం కోడి' తర్వాత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంది ఇదే. ఆ చిత్రానికి వచ్చిన సమస్యల్ని నేను, మా నాన్న, అన్న పంచుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే చేశాం. లభించిన ఫలితం ఆ కష్టాల్ని మరిపింపజేస్తోంది. ప్రసారమాధ్యమాలు మెచ్చుకుంటున్నాయి. గతంలోనే చెప్పా... ఇది ఆర్య చేయాల్సిన చిత్రమని. నాపై ఉన్న ప్రేమతో నాకు అప్పగించాడు. మేమంతా అనుకున్నట్టే మంచి విజయం దక్కింది. ఇలాంటి ఇక్కట్లు ఎన్ని ఎదురైనా పట్టించుకోను అన్నారు.

  ఇక ఏ ముహూర్తాన దర్శకుడు నా చిత్రానికి 'సమర్‌' (వెంటాడు వేటాడు) అనే పేరు నిర్ణయించారో తెలియదు కానీ.. నిజంగానే ఇది విడుదల కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో పేరు మార్చుకుందామని కూడా అనుకున్నాం. కథకు తగ్గది కావడంతో వెనకడుగు వేశాం అన్నారు.

  తిరు దర్శకత్వంలో విశాల్‌ హీరోగా నటించిన 'సమర్‌' సంక్రాంతికి జనం ముందుకొచ్చింది. త్రిష హీరోయిన్. ఈ చిత్రంపై విశాల్‌ భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి థియేటర్‌కు చేరుకునే వరకు చాలా సమస్యలు ఎదుర్కొంది. ఎట్టకేలకు విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. సరికొత్త కథతో ప్రేక్షకుడ్ని ఆసాంతం ఆశ్చర్యపరిచే స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రారంభంలో కొద్దిచోట్ల మాత్రమే విడుదలైంది. మంచి ఫలితం రావడంతో అదనంగా మరిన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ విషయమై దర్శకుడు తిరు, నటుడు విశాల్‌, నటి త్రిష మీడియాతో ముచ్చటించారు.

  ప్రారంభంలో తక్కువచోట్ల విడుదలైనా ఇప్పుడు పలు ప్రాంతాల నుంచి థియేటర్‌ యజమానులు బాక్సు కోసం ఫోన్‌ చేస్తున్నారు. ఇదేమాకు లభించిన విజయం. రెండు రోజుల్లో 120 థియేటర్లు పెరిగాయి. తాజాగా ఇప్పుడు మరో 70 ప్రాంతాల్లో జనం మధ్యకు తీసుకెళుతున్నాం.

  త్రిష మాట్లాడుతూ... తొలుత నాకు 'సమర్‌' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్‌ షేడ్స్‌ కనిపించాయి. ఆ స్క్రిప్ట్‌ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్‌ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.

  English summary
  Vishal recollected the hurdles the film faced right from the title , which was later changed from Samaran to Samar, and added that they overcame them because of the confident team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X